Lord krishna: ఏటా శ్రావణ మాసం బహుళ అష్టమి రోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారు. ఈ రోజు ప్రత్యేకపూజలు, ఉపవాస దీక్షలు, భాగవతపఠం చేస్తారు. కన్నయ్యను భగవంతుడిగా కన్నా గురువుగా ఆరాధిస్తే సకల శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశివారిపై ఒక్కో దేవుడి అనుగ్రహం ఉంటుందని చెబుతారు. మరి శ్రీ కృష్ణుడికి ప్రియమైన రాశులేంటి? ఆ రాశుల్లో మీరున్నారా? ఇక్కడ తెలుసుకోండి...
 


Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి 2024 ఆగష్టు 26 or 27 - ఎప్పుడు జరుపుకోవాలి!


వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)


శ్రీ కృష్ణుడి జన్మ నక్షత్రం రోహిణి... రోహిణి నాలుగు పాదాలు వృషభ రాశిలోనే ఉంటాయి. అందుకే ఈ రాశివారిపై కన్నయ్య ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. కృష్ణుడిని భక్తితో స్మరించి ఏపని ప్రారంభించినా సక్సెస్ అవుతారు. ఈ రాశివారు శ్రీ కృష్ణాష్టమి రోజు ఉపవాసం ఉండడం, ప్రత్యేక పూజలు చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తారట. ఈరోజు గోమాతకు సేవచేయడం అత్యంత శుభకరం. 


కర్కాటక రాశి (Cancer) (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)


కర్కాటర రాశివారిపై శ్రీ కృష్ణుడి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఈ రాశివారు మనస్ఫూర్తిగా రాథాకృష్ణుడిని ఆరాధించి ఏ పని ప్రారంభించినా సక్సెస్ అవుతారట. మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఉద్యోగం, వివాహం, సంతానం..ఇలా వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం అవుతాయంటారు. కృష్ణాష్టమి రోజు ప్రత్యేక పూజలతో పాటూ కన్నయ్యకు ఇష్టమైన అటుకులు, తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి.  


సింహ రాశి (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


సింహ రాశివారిపై శ్రీ కృష్ణుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఈ రాశివారు చిన్ని కృష్ణుడిపై మనసు లగ్నం చేసి..ఏ పని ప్రారంభించినా విజయం తథ్యం అంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో నూతన ప్రణాళికలు వేసుకోవాలన్నా, వాటిని అమలు చేయాలన్నా కన్నయ్య ఆశీస్సులు పొందితే అక్కడ అన్నీ మంచి ఫలితాలే పొందుతారు. కృష్ణాష్టమి రోజు వేణుమాథవుడిని ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటూ...గోమాతకు సేవ చేస్తే మీ జీవితంలో శుభం జరుగుతుంది


Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?


తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)


తులా రాశివారికి చెందిన వారు శ్రీ కృష్ణుడిని పూజిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లక్ష్యసాధనలో అడుగు ముందుకు పడుతుంది. ఏపని ప్రారంభించినా అపజయం ఉండదు. ఈ రాశివారిపై రాథాకృష్ణుడి ప్రత్యేక అనుగ్రహం ఉండడం వల్లే ఇదంతా సాధ్యమవుతుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. శ్రీ కృష్ణాష్టమి రోజు తులారాశివారు కృష్ణుడిని పూజించి వెన్న నైవేద్యంగా సమర్పించాలి.   


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.


Also Read: లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా దక్కాలంటే..తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలా చేయండి!