Krishna Janmashtami 2023 Date and Shubh Muhurat: పండుగలన్నీ తిథులను పరిగణలోకి తీసుకునే నిర్ణయిస్తారు. ఏ రోజు సూర్యోదయానికి తిథి ఉంటే ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటారు...అయితే కొన్ని పండుగల విషయంలో రోజంతా తిథి ఉండడం ప్రధానంగా భావిస్తారు. ఈ సారి కృష్ణాష్టమి విషయంలో ఆగష్టు 26 సోమవారమే పండుగ అని పండితులు నిర్ణయించారు. అయితే ఆరోజు సూర్యోదయం తర్వాత అష్టమి తిథి వచ్చింది..మర్నాడు ఆగష్టు 27 మంగళవారం సూర్యోదయం అయిన వెంటనే నవమి వచ్చేస్తోంది. అందుకే ఆగష్టు 26 సోమవారమే కృష్ణాష్టమి జరుపుకోవాలి.
Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?
అష్టమి ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు
ఆగష్టు 26 సోమవారం ఉదయం 8 గంటల 40 నిముషాల వరకూ సప్తమి ఉంది..ఆ తర్వాత అష్టమి ఘడియలు మొదలయ్యాయి.
ఆగష్టు 27 మంగళవారం ఉదయం 6 గంటల 49 నిముషాలకు అష్టమి ఘడియలు వెళ్లిపోతున్నాయి..నవమి మొదలవుతుంది..
శ్రీ కృష్ణుడి జన్మనక్షత్రం రోహిణి
ఆగష్టు 26 సోమవారం రాత్రి 9 గంటల 23 నుంచి ఆగష్టు 27 మంగళవారం రాత్రి 8 గంటల 30 నిముషాలవరకూ ఉంది.
కృష్ణాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి?
సాధారణంగా జన్మతిథి జరుపుకున్నప్పుడు సూర్యోదయానికి తిథి ఉండేలా చూసుకుంటారు. నక్షత్రం ఓ రోజు అటు ఇటుగా ఉన్నప్పటికీ తిథిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అందుకే పంచాంగకర్తలంతా ఆగష్టు 26 సోమవారం రోజంతా అష్టమి తిథి ఉండడంతో ఈ రోజే కృష్ణాష్టమి అని నిర్ణయించారు. శ్రావణమాసంలో అమవాస్య ముందువచ్చే అష్టమి రోజు అర్థరాత్రి జన్మించిన చిన్ని కృష్ణుడు..మర్నాడు సూర్యోదయానికి గోకులంలో నందుడి ఇంట్లో యశోద దగ్గరకు చేరుకున్నాడు. అయితే వైష్ణవులు మాత్రం రోహిణితో కూడిన అష్టమినే సెలబ్రేట్ చేసుకుంటారు.
Also Read: అరుణాచలంలో నిత్యం గిరిప్రదక్షిణ చేసే టోపీ అమ్మ ఎవరు.. ఆమెను చూస్తే భక్తులకు ఎందుకంత పూనకం!
గోకులాష్టమి
శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు గోకులంలో పెరగడం వల్ల ఈ రోజుని గోకులాష్టమిగా కూడా జరుపుకుంటారు. ఈరోజంతా కొందరు ఉపవాసం చేస్తే మరికొందరు ఓ పూట భోజనం చేస్తారు. కృష్ణుడి ఆలయాలు దర్శింకుంటారు.ఈ రోజు వైష్ణవ ఆలయాల్లో అష్టోత్తర , సహస్రనామ పూజలు చేయించుకునేవారికి వంశాభివృద్ధి,అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. భక్తిశ్రద్ధలతో కన్నయ్యను పూజిస్తే సకల పాపాలు నశించి, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంధ పురాణం చెబుతోది.
సంతాన గోపాల వ్రతం
వివాహం కానివారు, సంతానం లేనివారు శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు సంతానగోపాలవ్రతం ఆచరిస్తారు. ఈ రోజు సంతానగోపాల వ్రతం ద్వారా బాలగోపాలుడిని పూజిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయంటారు.
భాగవత పఠనం
శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు భాగవతం, భగవద్గీత పఠించాలి. కన్నయ్య అర్థరాత్రి దేవకీ గర్భాన జన్మించాడు కాబట్టి...రోజంతా ఉపవాసం ఉంది అర్థరాత్రి కృష్ణుడు ఉద్భవించిన సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు..మర్నాడు ఉదయం వైష్ణవ ఆలయాలను సందర్శించి ఉపవాసం విరమిస్తారు.
Also Read: లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా దక్కాలంటే..తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలా చేయండి!
శ్రీ కృష్ణాష్టకం
వసుదేవసుతం దేవం - కంసచాణూరమర్దనం |
దేవకీపరమానందం - కృష్ణం వందే జగద్గురుమ్ ||
అతసీపుష్పసంకాశం - హారనూపురశోభితం |
రత్నకంకణకేయూరం - కృష్ణం వందే జగద్గురుమ్ ||
కుటిలాలకసంయుక్తం - పూర్ణచంద్రనిభాననం |
విలసత్కుండలధరం - కృష్ణం వందే జగద్గురుమ్ ||
మందారగంధసంయుక్తం - చారుహాసం చతుర్భుజం |
బహీర్పింఛావచూడాంగం - కృష్ణం వందే జగద్గురుమ్ ||
ఉత్ఫుల్లపద్మపత్రాక్షం - నీలజీమూతసన్నిభం |
యాదవానాం శిరోరత్నం - కృష్ణం వందే జగద్గురుమ్ ||
రుక్మిణీకేళిసంయుక్తం - పీతాంబరసుశోభితం |
అవాప్తతులసీగంధం - కృష్ణం వందే జగద్గురుమ్ ||
గోపికానాం కుచద్వంద్వం - కుంకుమాంకితవక్షసం |
శ్రీనికేతనం మహేష్వాసం - కృష్ణం వందే జగద్గురుమ్ ||
శ్రీవత్సాంకం మహోరస్కం - వనమాలావిరాజితం |
శంఖచక్రధరం దేవం - కృష్ణం వందే జగద్గురుమ్ ||
కృష్ణాష్టక మిదం పుణ్యం - ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం - స్మరణేన వినశ్యతి ||
ఇతి శ్రీ కృష్ణాష్టకం