Ravi Teja: బాలకృష్ణ సినిమా తర్వాత రవితేజతో... అసలు నిజం ఏమిటంటే?

Ravi Teja New Movie: మిస్టర్ బచ్చన్ సినిమాతో ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చారు మాస్ మహారాజా. దీని తర్వాత 'సామజవరగమన' రచయిత భాను భోగవరపుతో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సినిమా ఫిక్స్ అయిందట.

Continues below advertisement

మాస్ మహారాజా రవితేజ మహా స్పీడుగా సినిమాలు చేస్తారు. ప్రతి ఏడాది మినిమం రెండు మూడు సినిమాలను థియేటర్లలోకి తీసుకు వచ్చే స్టార్ హీరో ఆయన.‌ 'మిస్టర్ బచ్చన్' సినిమాతో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పటికే కొత్త సినిమాను సెట్స్ మీదకు కూడా తీసుకు వెళ్లారు. 'సామజవరగమన' రచయిత భాను బోగవరపు దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత మరొక సినిమా ఓకే చేశారని వార్తలు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

బాబీ దర్శకత్వంలో రవితేజ సినిమా?
మాస్ మహారాజా రవితేజ పరిచయం చేసిన దర్శకులలో బాబి కొల్లి అలియాస్ కె ఎస్ రవీంద్ర ఒకరు. 'పవర్' సినిమాతో అతను దర్శకుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.‌ స్క్రీన్ ప్లేయర్ రచయితగా బాబీ పేరు తెరపై తొలిసారి పడింది కూడా రవితేజ సినిమాతో అని చెప్పాలి. 'డాన్ శీను' సినిమాకు ఆయన పని చేశారు. లేటెస్ట్ టాలీవుడ్ ఫిలింనగర్ గుసగుస ఏమిటంటే... బాబితో మరోసారి రవితేజ సినిమా చేయనున్నారు అని!

రవితేజ కథానాయకుడిగా 'మిస్టర్ బచ్చన్',‌‌ ఆ సినిమాకు ముందు పాన్ ఇండియా ఫిల్మ్ 'ఈగల్', అంతకు ముందు 'ధమాకా'... హ్యాట్రిక్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఆ సంస్థలో రవితేజ హీరోగా బాబి దర్శకత్వంలో సినిమా రూపొందుతోందని వినబడింది.‌ అయితే ఆ వార్తలలో నిజం లేదని తెలిసింది.

Also Read: తెరపైకి సిక్సుల వీరుడు యువరాజ్ జీవితం... బయోపిక్‌లో క్రికెట్ నుంచి క్యాన్సర్ పోరాటం వరకు!

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి భారీ యాక్షన్ ఫిలిం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా నుంచి రెండు వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఆ రెండిటికి ప్రేక్షకుల నుంచి ముఖ్యంగా నందమూరి అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. ప్రస్తుతానికి బాబీ దృష్టి అంతా ఆ సినిమా మీద మాత్రమే ఉందని, కొత్త సినిమా గురించి ఆయన ఆలోచించడం లేదని తెలిసింది.

Also Readసూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరొక హీరో - అన్నయ్య కొడుక్కి అండగా మహేష్!


ప్రస్తుతం 'సామజవరగమన' రచయిత భానును దర్శకుడిగా పరిచయం చేస్తూ... చేస్తున్న సినిమా మీద రవితేజ దృష్టి పెట్టారని సమాచారం. ఆయన 75వ సినిమా కావడంతో దానిమీద కాస్త ఎక్కువ కేర్ తీసుకుంటున్నారట. కథలు వింటున్నప్పటికీ... ప్రస్తుతానికి కొత్త సినిమాకు సంతకం చేయలేదని తెలిసింది. దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి రవితేజతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి.

Also Readఒకే వేదికపైకి అల్లు అర్జున్ - సుకుమార్... మారుతి నగర్ ఈవెంట్‌లో 'పుష్ప 2' పుకార్లకు చెక్!?

Continues below advertisement