ఇటీవల కాలంలో పాటలు, ప్రచార చిత్రాలతో ఆసక్తి కలిగించిన చిన్న సినిమాల్లో 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ముందు వరుసలో ఉంటుంది. అందులో రావు రమేష్ హీరోగా యాక్ట్ చేశారు. ఆల్రెడీ సినిమాను క్రియేటివ్ జీనియస్ సుకుమార్, ఆయన భార్య తబిత చూశారు. వాళ్లకు నచ్చింది. దాంతో తబితా సుకుమార్ సమర్పణలో 'మారుతి నగర్ సుబ్రమణ్యం' విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ (Maruthi Nagar Subramanyam Movie Pre Release Event)కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ను ముఖ్య అతిథిగా తీసుకు వస్తున్నారు.

ఒకే వేదిక మీదకు అల్లు అర్జున్... సుకుమార్!'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం (ఆగస్టు 23న) ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లో జరిగే ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు అవుతున్నారని మారుతి నగర్ సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది. సుకుమార్ భార్య తబిత 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రజెంటర్ కనుక ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఒకే వేదికపై 'పుష్ప 2' హీరో, దర్శకుడు వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడీ విషయం ప్రేక్షకుల్లో డిస్కషన్ పాయింట్ అయ్యింది.

అల్లు అర్జున్, సుకుమార్ మధ్య దూరం పెరిగిందని... 'పుష్ప 2' షూటింగ్ ప్లాన్ ప్రకారం జరగకుండా ముందుకు వెనక్కి అవుతుండటంతో దర్శకుడి మీద హీరో అసంతృప్తి వ్యక్తం చేశారని... ఆ మధ్య పుకార్లు చాలా వినిపించాయి. 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ రూమర్స్ మీద బన్నీ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ డైరెక్టుగా అయినా సరే పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారని ఫిల్మ్ నగర్ గుసగుస. 

ఏపీ ఎన్నికలకు ముందు వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం మీద ప్రేక్షకుల్లో, ప్రజల్లో డిస్కషన్ జరిగింది. అయితే, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆ పుకార్లను మీడియా ప్రస్తావించగా సమాధానం ఇచ్చారు అల్లు అర్జున్. 'మారుతి నగర్ సుబ్రమణ్యం' వేడుకలో ఆ  విధంగా ప్రశ్నలు ఉండకపోవచ్చు. కానీ, సుకుమార్ అంటే తనకు ఎంత ఇష్టం, తమ మధ్య బాండింగ్ ఎలా ఉంటుందనేది చెప్పడం ద్వారా పరోక్షంగా పుకార్లకు బన్నీ చెక్ పెట్టే ఛాన్స్ ఉంది.

Also Read: సినిమాల్లోనే హీరో బయట జీరో- చూడటానికి బాగానే ఉంటాడు కానీ మేటరే లేదు- రాజ్‌తరుణ్‌ పేరు చెప్పకుండానే యువతి ఆరోపణలు

'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాకు వస్తే... రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య నటించాడు. అల్లు అరవింద్ ఫ్యామిలీలో పుట్టిన తనను 'అల వైకుంఠపురములో' సినిమా టైపులో చిన్న ఇంటికి తీసుకు వచ్చారని, అల్లు అర్జున్ తన అన్నయ్య - అరవింద్ తన తండ్రి అని ఊహల్లో బ్రతికే క్యారెక్టర్ అతడిది. ఈ సినిమాలో 'మేడమ్ సార్ మేడమ్ అంతే' పాటలో అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమాల్లో మాంటేజులను రీ క్రియేట్ చేశారు. ఆగస్టు 23న విడుదల అయ్యే ఈ సినిమా వేడుకకు బన్నీ రావడానికి అదీ ఒక కారణం అయ్యి ఉండొచ్చు. 

Also Read: వేట్టయాన్ వర్సెస్ కంగువ... దసరా బరిలో రజనీకాంత్ - సూర్య సినిమాకు పోటీగా