Karthika Deepam Serial Today Episode తమని తల్లిదండ్రులు అనుకోమని సుమిత్ర దీపతో చెప్తే జ్యోత్స్న కార్తీక్ తల్లిదండ్రులను అత్తామామలా అని అడుగుతుంది. సుమిత్ర జ్యోత్స్న మీద కోప్పడితే మీరు తల్లిదండ్రులు అయితే అత్తామామలు ఏమవుతారని అడుగుతుంది. 


జ్యోత్స్న: దీప కోసం నువ్వు ఒక్కరోజే కోర్టుకి వెళ్లావ్ నేను రెండు రోజులు వెళ్లాను ఇప్పుడు చెప్పు ఎవరికీ దీప మీద ఎక్కువ ప్రేమ ఉందో. నాతో పోటీ పడకు మమ్మీ మనుషుల్ని నాలా ఎవరూ ప్రేమించలేరు. ఏం దీప నీకు ఏం సాయం కావాలో చెప్పు ఎందుకంటే మా మమ్మ డాడీ ఆగిపోయిన కూతురి నిశ్చితార్థం గురించి కాకుండా నీ గురించే ఆలోచిస్తున్నారు. మరో పేరెంట్స్ అయితే అరెరే నిశ్చితార్థం ఆగిపోయింది మళ్లీ ఎప్పుడు చేద్దాం పెళ్లి ఎక్కడ చేద్దాం అని ఆలోచిస్తారు కానీ మా పేరెంట్స్ అలా కాదు నీ గురించే ఆలోచిస్తారు. నీ జీవితం ఏమైపోతుందా అని తెగ ఫీలవుతున్నారు. నేను బావతో పెళ్లి అవుతుందనే భ్రమలో బతుకుతున్నాను. మళ్లీ ఎక్కడ పెళ్లి ఆగిపోతుందనే భయంతో బతుకున్నాను. నీకు ఇక ఈ బెంగ లేదు దీప హ్యాపీగా ఇక్కడే ఉండిపోవచ్చు.
దీప: సరిగ్గా చూడలేని వాడికి అర్దం చేసుకునే అవకాశం ఉండదు. అర్థం చేసుకునేవాడికి సరిగా చెప్పే అవకాశం ఉండదు. మొదటి దాంట్లో నువ్వు ఉంటే రెండో దాంట్లో నేను ఉన్నా. కానీ నీకు నేను అర్థమయ్యేలా చెప్తా. కార్తీక్ బాబుకి మీకు పెళ్లి నా సమక్షంలోనే జరుగుతుంది. అది చూసే నేను ఇక్కడ నుంచి వెళ్తా. ఎందుకంటే మీ పెళ్లి నాకు బాధ్యతే. మీ పెళ్లి అయితేనే ఇక్కడ నుంచి నా కూతుర్ని తీసుకొని వెళ్లిపోతా. 


స్వప్న తన లవర్ కాశీ బయట కలిసి ఐస్‌క్రీమ్ తింటూ మాట్లాడుకుంటారు. పెళ్లి చేసుకుందామని కాశీ అంటే ముందు జాబ్ చేస్తే ఓకే చెప్తారని అంటుంది స్వప్న. ఇక తనకు సపోర్ట్‌గా అన్నయ్య ఉన్నాడని అంటుంది. ఎవరని కాశీ అడిగితే కార్తీక్ గురించి చెప్తుంది. ఇక కాశీకి డబ్బులు ఇస్తుంది. తర్వాత కాశీని డ్రాప్ చేయడానికి తన స్కూటీ మీద తీసుకెళ్తుంది. మరోవైపు కార్తీక్ శౌర్యని చెక్‌అప్‌ ఉందని తీసుకెళ్తానని అంటాడు. దానికి శ్రీధర్ అడ్డుకొని దీప చూసుకుంటుంది నీకు ఎందుకని అంటాడు. కాంచన కూడా భర్తకే సపోర్ట్ చేసి దీపకే చెప్పని అంటుంది. దానికి కార్తీక్ తర్వాత నుంచి దీపకి చెప్తానని అంటాడు. 


దీప శౌర్యకి టిఫిన్ తినిపిస్తుంటుంది. జ్యోత్స్న మీద నుంచి అది చూస్తుంటే పారిజాతం జ్యోత్స్న నువ్వు అనుకున్నవేవైనా జరగాలి అంటే ఏదో ఒకటి చేసి దీపని పంపేయాలని అంటుంది. ఇంతలో కార్తీక్ దీప వాళ్ల దగ్గరకు వస్తాడు. ఇక కార్తీక్ దీపకి గుడికి వెళ్లమని తాను శౌర్యని హాస్పిటల్‌కి తీసుకెళ్తా అంటాడు. కార్తీక్ తన దగ్గర ఏమైనా దాస్తున్నాడా అని దీపకి అనుమానం వస్తుంది. దీప కార్తీక్‌తో పెళ్లి గురించి ఆలోచించమని అంటుంది. 


జ్యోత్స్న: మనం దీప గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం అనిపిస్తుంది గ్రానీ. దీపకి బావ మీద ఏ ఫీలింగ్ లేదు బావకి కూడా దీప మీద ఎలాంటి ఉద్దేశం లేదు ఇక మనం దీప గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు
పారిజాతం: అవునా ఇదే మాట ఒక్కసారి అటు చూసి చెప్పు. (కార్తీక్ దీపలు మాట్లాడుకోవడం చూస్తారు) ఇప్పుడు చెప్పు వాళ్లిద్దరికీ ఏ ఉద్దేశం లేదని.
జ్యోత్స్న: వాళ్లేం మాట్లాడుకుంటున్నారు గ్రానీ.
పారిజాతం: ఇకేం ఉంది నువ్వు నాకోసం నిశ్చితార్థం ఆపేశావ్ నేను నీ కోసం విడాకులు తీసుకున్నాను ఇక మనిద్దరం పెళ్లి చేసుకొని కొత్త కాపురం పెట్టేద్దాం అని మాట్లాడుకుంటున్నారు. 
జ్యోత్స్న: గ్రానీ పొడిచేస్తా నిన్ను.
పారిజాతం: అక్కడ జరిగేది నా కంటికి అదే కనిపిస్తుంది. 


ఇక శౌర్య రావడంతో కార్తీక్ సమాధానం చెప్పకుండా పాపని తీసుకొని వెళ్లిపోతాడు. దీప కార్తీక్ వెంట పరుగులు తీస్తుంది. కార్తీక్ పాపని తీసుకొని సుమిత్ర దగ్గరకు వెళ్లి ముఖ్యమైన విషయం చెప్పాలని అందర్ని పిలుస్తాడు. దీపని పెళ్లి చేసుకుంటా అని చెప్పడానికే ఇలా దీపని, శౌర్యని తీసుకొని వచ్చాడని అంటుంది పారిజాతం. కార్తీక్ విషయం చెప్పబోతే దీప, పారిజాతం ఇద్దరూ ఒకేసారి ఆపుతారు. ఇంతలో కార్తీక్ నేను చెప్తే దీప చెప్పినట్లే అని అంటాడు. మనవడు కొంప ముంచేలా ఉన్నాడని పారిజాతం షాక్ అవుతుంది. జ్యోత్స్నతో నిశ్చితార్థం అవసరం లేదని కార్తీక్ అంటాడు. అందరూ షాక్ అవుతారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: శ్రీమంతురాలయ్యే ఐడియా సుమనకు చెప్పిన పెద్దబొట్టమ్మ.. ఆ తవ్వకంలో ఏం మాయ ఉందో!