Trinayani Serial Today Episode విశాల్ కొబ్బరి కాయ కోసం వెళ్లడం వల్లే విశాల్‌కి తేలు కుట్టిందని కొబ్బరి కాయను కోపంతో విసిరేస్తుంది. అది వెళ్లి మాంత్రికుడు గజగండకు తగులుతుంది. విశాల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లాని అందరూ కంగారుగా బయల్దేరుతారు. రాత్రి సుమన విక్రాంత్ దగ్గరకు వచ్చి రేపు ఉలూచి పుట్టినరోజు కదా నిద్ర పట్టడం లేదని మీకు కూడా అంతేనా అని అంటుంది. దానికి విక్రాంత్ పుట్టిన రోజు గురించి కాదని విశాల్‌కి తేలు కుట్టడం గురించి టెన్షన్ పడుతున్నానని అంటాడు.


సుమన: ఓ అందుకు బాధ పడుతున్నారా ఆయనకు పాము కుట్టలేదు కదా.
విక్రాంత్: ఏయ్ మెంటల్ తేలుకి కూడా విషం ఉంటుంది కదా. 
సుమన: ఏం జరిగినా మా అక్కకి ఏం చేయాలో తెలుసు. అసలు మా అక్క ధ్యాస అంతా కొబ్బరి కాయ మీద పెట్టింది కానీ మొగుడి మీద పెట్టలేదు. లేదంటే ఇలా జరిగేది కాదు. మీరు తెగ కంగారు పడి హడావుడి చేయకండి నా కూతురి ఫంక్షన్‌కి కల పోతుంది. 
విక్రాంత్: ఏయ్ ఎందుకు ఫంక్షన్ ఫంక్షన్ అని చంపుతావ్. ఫంక్షన్‌కి డబ్బులు ఇచ్చిన విశాల్ బ్రోకే బాలేదు. నువ్వేమో హంగామా చేస్తున్నావ్.


నయని విశాల్‌కి కట్టు కట్టి ధైర్యం చెప్తుంది. హాసిని కూడా అక్కడికి వస్తుంది. తిలోత్తమకో వల్లభకో కుట్టుంటే బాగుండని అంటుంది. ఇక విశాల్ నయనితో ఎవరికైనా ప్రమాదం జరిగితే ముందు నీకు తెలిస్తుంది కదా అని అంటాడు. హాసిని కూడా కరెక్టే కదా అని అనుమానం వ్యక్తం చేస్తుంది. 


హాసిని: అది కూడా మీ ఆయన విషయంలో అంచనా వేయలేకపోయావ్ ఎందుకని.
నయని: అదే అర్థం కావడం లేదు అక్క. గుడి దగ్గర కూడా కొబ్బరి కాయ కొట్టాలి అనుకున్న ప్రతీసారి చేయి జారిపోవడం, నాలుగో సారి అది తేలు దగ్గరకే వెళ్లడం బాబుగారికి తేలు కుట్టడం అసలు నాకు ఎందుకు తెలియలేదా అని నాకే గిల్టీగా ఉంది.
విశాల్: నయని ఏం పర్లేదు రేపటికి తగ్గిపోతుందిలే.
నయని: అక్క నాకు కూడా నాకు గుడి నుంచి వచ్చాక తలనొప్పి వచ్చింది. అత్తయ్య నా నుదిటిన మీతో కుంకమ పెట్టించి తర్వాత అలా అయిందా లేదంటే అందరికీ తలనొప్పి వచ్చిందా. 
హాసిని: నీ అనుమానంలో లాజిక్ ఉంది నేను మళ్లీ వస్తా ఆగండి. 


తిలోత్తమ, వల్లభలు విశాల్ గురించి మాట్లాడుకొని నవ్వుకుంటుంటారు. హాసిని అక్కడికి వచ్చి సీరియస్ అవుతుంది. గుడి దగ్గర ఇచ్చిన బొట్టులో ఏముందని అడుగుతుంది. తిలోత్తమ షాక్ అవుతుంది. అందులో మత్తు ఉందా అని అడుగుతుంది దాని వల్ల నయనికి తలనొప్పి వచ్చిందని నయని ఇబ్బంది పడిందని అంటుంది. దాంతో వల్లభ స్నానం చేసిన తర్వాత దాని పవర్ పోతుందని అంటుంది. ఇక హాసిని ప్రశ్నలకు తిలోత్తమ కవర్ చేస్తుంది. తిలోత్తమ హాసిని మీద సీరియస్ అయి పంపేస్తుంది. 


ఉదయం సుమన పాప బర్త్‌డేకి ఏ చీర కట్టుకోవాలో అనుకొని చీరలన్నీపోగోసి చూస్తుంటుంది. ఉలూచి కింద ఉండటంతో పెద్ద బొట్టమ్మ సుమన గదిలోకి వచ్చి ఉలూచిని ఎత్తుకుంటే సుమన సీరియస్ అవుతుంది. గది నుంచి పంపేస్తుంది. 


పెద్దబొట్టమ్మ: వెళ్తాను కానీ నువ్వు శ్రీమంతురాలివి కావాలని నీకు లేదా. 
సుమన: ఉంటుంది. కానీ అవకాశం కూడా ఉండాలి కదా.
పెద్దబొట్టమ్మ: నా మాట విను నీకు మంచి అవకాశం ఇస్తాం. 
సుమన: నేను నీ మాటలు వినను నువ్వు మోసం చేసే ముసలి పామువి.
పెద్దబొట్టమ్మ: లేదు సుమన నన్ను నమ్ము ఉలూచి పుట్టిన రోజున నేను నా భర్త నాగయ్య పాములుగా మారి పడగలు విప్పి ఉంటాం. అప్పుడు నువ్వు ఉలూచిని బుట్టలో పెట్టి మా శిరస్సున పెడితే నువ్వు ధనవంతురాలివి అయ్యే అవకాశం ఉంటుంది.
సుమన: పాముల నెత్తిన నా బిడ్డను ఉంచమంటావా. మతి పోయిందా అని నన్ను కూడా అంటారు.
పెద్దబొట్టమ్మ: సుమన నేను చెప్పిన మాట విను అమ్మవారి దగ్గర మీ బావకి తేలు కుట్టిన చోట తవ్వి చూడు నీకే తెలుస్తుంది. అందులో నుంచి బయట పడిన దానితో నీకు సకల సంపదలు దక్కుతాయి.
సుమన: నిజమేనా నువ్వు చెప్పేది.
పెద్దబొట్టమ్మ: ఉలూచి నా బిడ్డ కూడా అందుకే పిల్ల మీద కూడా ఒట్టు.
సుమన: ఇంత నమ్మకంగా చెప్తున్నావ్ కదా అక్కడ ఏమైనా దొరికితే పిల్లని నీ తలమీద ఉంచుతా అక్కడ ఏమీ దొరక్కపోతే నీ అంతు చూస్తా.


అందరూ బయట కూర్చొని ఫంక్షన్‌కి ఏం వెరైటీలు పెట్టాలా అని మాట్లాడుకుంటారు. పావనామూర్తి లిస్ట్ చెప్తే హాసిని రాస్తుంది. సుమన కూడా ఉలూచిని తీసుకొని వస్తుంది. నీకు ఏం కావాలో చెప్పు వండి పెడతా అని హాసిని అంటే తవ్వి పెట్టాలని చెప్తుంది. విక్రాంత్ పెద్దగా నవ్వి ఆరు ఆడుగులు తవ్వుతాం చనిపో అంటాడు. ఇక అందరూ ఏం తవ్వాలి అని అడిగితే సుమన తనకు కల వచ్చిందని పెద్దబొట్టమ్మ చెప్పిన విషయం తనకు కల వచ్చిందని అక్కడ తవ్వాలని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. పెద్ద బొట్టమ్మ చాటుగా ఆ  మాటలు వింటుంది. ఇక తిలోత్తమ వల్లభతో మనం దేని కోసం ఎదురు చూస్తున్నామో ఆ పని సుమన చేయమని అంటుందని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్రాను కిడ్నాప్ - షాక్‌లో లక్ష్మీ, వివేక్‌, జయదేవ్! లక్కీతో ఫోన్‌లో మాట్లాడింది ఏవరు?