Horoscope Tomorrow: 11 March 2024  Prediction


మేష రాశి
ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.  పాత మిత్రులను కలుస్తారు. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెట్టవచ్చు.


వృషభ రాశి
అధిక ఖర్చుల కారణంగా ఆందోళన చెందుతారు. వివాహిత స్త్రీలకు కొన్ని ఇబ్బందులుంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు పని విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారం బాగానే సాగుతుంది. బడ్జెట్ కి అనుగుణంగా కొత్త ఆర్థిక ప్రణాళికలు వేసుకోవాలి.


Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!
 
మిథున రాశి
వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేయాలి. ఉద్యోగులకు సవాలుతో కూడిన సమయం. కెరీర్లో సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి.  ఒంటరి వ్యక్తులకు ఈరోజు ప్రతిపాదన రావచ్చు లేదా వివాహం ఖరారు కావచ్చు.


కర్కాటక రాశి
ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు.  ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలనే ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది. ఆస్తిలో పెట్టుబడి పెట్టే ముందు సరైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మాటతీరు మార్చుకోవడం మంచిది. ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది .


సింహ రాశి
కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచిసమయం. స్వీయ సంరక్షణ కార్యకలాపాలలో పాల్గొంటారు. పనిలో అదనపు బాధ్యతల కోసం సిద్ధంగా ఉండండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి జీవితంలో చాలా పెద్ద సానుకూల మార్పులు ఉంటాయి.  కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి.


Also Read: ఈ వారం (మార్చి 10 - 16) ఈ రాశులవారిని గ్రహబలం కాదు మనోధైర్యమే నడిపిస్తుంది!


కన్యా రాశి
ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు. మీ మాటలపై నియంత్రణ ఉంచండి. ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారులు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. రిస్క్ చేయవద్దు. పనిలో ఆటంకాలు తొలగిపోవడానికి కుటుంబ సభ్యుల సహకారం తోడ్పడుతుంది. కొంతమందికి ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.


తులా రాశి 
ఈ రోజు మీరు కొత్త ప్రాజెక్టు బాధ్యతలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.  విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మీ కెరీర్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తే మంచి ఫలితం ఉంటుంది. 


వృశ్చిక రాశి
ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. ఆఫీసులో ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. స్నేహితులతో సమయం గడుపుతారు. ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ కోపాన్ని నియంత్రించుకోండి. అవివాహితులకు సంబంధం నిశ్చయమవుతుంది. 


ధనుస్సు రాశి
ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు.  సన్నిహితుల సహకారంతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి.  సంబంధాలలో అపార్థాలు పెరుగుతాయి. ఓపిక పట్టండి మరియు తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా ఉండొద్దు.


మకర రాశి
ఈ రాశి వారి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేముందు ఆలోచించండి. పెట్టుబడులు పెట్టేముందు మరోసారి ఆలోచించాలి.  ఆర్థిక విషయాలలో ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు.  పిల్లల ఆరోగ్యం గురించి మనస్సు ఆందోళన చెందుతుంది.  కార్యాలయంలో   సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. కొత్త ప్రాజెక్ట్ కోసం బాధ్యత వహించడానికి వెనుకాడరు. 


Also Read: ఆలయాల నీడ ఇళ్లపై పడితే ఏమవుతుంది!


కుంభ రాశి
ఈ రోజు ప్రారంభంలో ఆశ  నిరాశ  భావాలు ఉంటాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు గందరగోళానికి గురవుతారు.  ఒంటరి వ్యక్తులు ప్రేమలో పడతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొంతమందికి ఉదర సంబంధిత సమస్యలతో బాధపడతారు.


మీన రాశి
ఈ రోజు మీకు సాధారణంగానే ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి జీవితంలో అదనపు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి. కొందరు వ్యక్తులు సవాలుతో కూడిన పనులను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజు మీరు ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించండి. త్వరలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుతుంది.


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం