UBI SO Admit Card 2024: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచారు. స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబరు, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్‌కార్డు వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది. అదిలేనిదే పరీక్ష రాసేందుకు అనుమతి ఉండదు. అడ్మిట్‌కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును తీసుకెళ్లాలి. 


యూబీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..


➥ హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - unionbankofindia.co.in


➥ అక్కడ హోంపేజీలో కనిపించే "Recruitment" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.


➥ ఇప్పుడు అక్కడ వచ్చే పేజీలో కనిపించే "Download UBI SO Call Letter 2024" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.


➥ క్లిక్ చేయగానే వచ్చే పేజీలో అభ్యర్థి తన రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబరు, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'SUBMIT చేయాలి.


➥ అభ్యర్థుల పరీక్ష కాల్‌లెటర్/ అడ్మిట్‌కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది


➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.


పరీక్ష విధానం..


➥ మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.


➥ అయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-25 ప్రశ్నలు-25 మార్కులు, రీజనింగ్- 50 ప్రశ్నలు-50 మార్కులు, అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నలు-100 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్- 25 ప్రశ్నలు-25 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.


➥ పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కులు కోత విధిస్తారు.


పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ ఎన్‌సీఆర్, హైదరాబాద్, చండీగఢ్/మొహాలీ, బెంగళూరు, లక్నో, చెన్నై, కోల్‌కతా, భోపాల్, పాట్నా, ముంబయి/నేవీ ముంబయి/గ్రేటర్ ముంబయి/థానే, భువనేశ్వర్, అహ్మదాబాద్/గాంధీనగర్.


పర్సనల్ ఇంటర్వ్యూ..


రాతపరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తం 50 మార్కులు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25గా నిర్ణయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 22.5గా నిర్ణయించారు. నిర్ణీత అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 1: 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.


గ్రూప్ డిస్కషన్: మొత్తం 50 మార్కులకు గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25గా నిర్ణయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 22.5గా నిర్ణయించారు. 


ఎంపికైనవారికి జీత భత్యాలు..


➥ చీఫ్ మేనేజర్ పోస్టులకు రూ.76,010-రూ.89,890 వరకు ఉంటుంది. 


➥ సీనియర్ మేనేజర్ పోస్టులకు రూ.63840-రూ.78,230 వరకు ఉంటుంది. 


➥ మేనేజర్ పోస్టులకు రూ.48,170-రూ.69,810 వరకు ఉంటుంది.  


➥ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.36,000-రూ.63,840 వరకు ఉంటుంది.  


నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..