మార్చి 10 రాశిఫలాలు


మేష రాశి


ఈ రాశివారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది.  సమస్యలను శాంతియుతంగా పరిష్కరించగలుగుతారు. స్నేహితుడితో కలసి ప్రయాణం చేస్తారు. తప్పులను పునరావృతం చేయవద్దు. వ్యాపార లావాదేవీలు జాగ్రత్తగా చేయండి. మీ జీవిత భాగస్వామిపై ప్రేమ పెరుగుతుంది.


వృషభ రాశి


చిన్న విషయాలకే కోపంగా ఉండకండి.  అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక  ప్రయోజనం పొందుతారు. కీలక నిర్ణయాలు ఈరోజు తీసుకోవద్దు.


మిథున రాశి


ఈ రోజు బంధువులను కలుస్తారు. వైవాహిక కార్యక్రమం గురించి ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది. సన్నిహితులు మీ విషయంలో మీరు ఊహించని విధంగా ప్రవర్తిస్తారు. నూతన మూలల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.


Also Read: ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకూ విశ్వావసు నామ సంవత్సర వృషభ రాశి నెలవారీ ఫలితాలు!
 
కర్కాటక రాశి


ఈ రోజు వ్యాపార లావాదేవీలను అప్రమత్తంగా చేయాలి. ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఆలోచనలు అమలుచేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.


సింహ రాశి


ఈ రోజు శత్రువులు పొంచి ఉన్నారు..మీరు అప్రమత్తంగా వ్యవహరించాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.  మీ బలహీనతలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు


కన్యా రాశి


అనుభవజ్ఞుల సలహాలు ఈరోజు మీకు ఉపయోగపడతాయి. ఈ రోజు మీకు అన్ని విధాలుగా మంచిరోజు అవుతుంది. కెరీర్ కి సంబంధించి కొనసాగుతున్న సమస్యలు అధిగమిస్తారు. ఆరోగ్యం బావుంటుంది


Also Read: వృషభ రాశి ఉగాది ఫలితాలు - ఈ ఏడాది మీ ప్రతి అడుగు బ్లాక్ బస్టరే ..పట్టిందల్లా బంగారమే!


తులా రాశి


తులా రాశివారు ఈ రోజు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఈ రోజు గుడ్ న్యూస్ వింటారు. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో పాల్గొంటారు. అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉంటుంది. పిల్లలకు సమయం కేటాయించండి. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.


వృశ్చిక రాశి


ఈ రోజు ఈ రాశివారు ప్రయాణంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. భౌతిక ఆనందాలు పెరుగుతాయి. ప్రేమికులు మధ్య కొత్త సమస్య మొదలవుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.


ధనస్సు రాశి


ఈ రాశివారు ఈ రోజు కుటుంబ సభ్యులతో కీలక విషయాలగురించి చర్చిస్తారు. భాగస్వామితో వివాదం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు ప్రమోషన్ గురించి సమాచారం వింటాకు. ఆదాయం, ఆరోగ్యం బావుంటుంది.


మకర రాశి


మీ ప్రవర్తనలో మార్పులు మీరు గమనిస్తారు. అపార్థాలకు అవకాశం ఇవ్వొద్దు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఉద్యోగం, వ్యాపారంలో సాధారణ ఫలితాలుంటాయి. కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి


కుంభ రాశి


ఈ రోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించవద్దు. ఉద్యోగులు ఇంక్రిమెంట్ సంబంధిత సమచారం పొందుతారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. విద్యార్థులు చదువుపై అదనపు శ్రద్ధ పెట్టాలి.


మీన రాశి


ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టొద్దు. నిరుద్యోగులు ఉద్యోగ ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. అదనపు ఒత్తిడి తీసుకోవద్దు.


Also Read: ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకూ విశ్వావసు నామ సంవత్సర మేష రాశి నెలవారీ ఫలితాలు!


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.