మేష రాశి


ఈ రోజు కొత్త పనిని ప్రారంభించవచ్చు. మీ సలహాల నుంచి అందరూ ప్రయోజనం పొందుతారు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఆందోళనలనుంచి బయటపడతారు. ( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


వృషభ రాశి


ఈ రోజు ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది. మీరు మీ మనస్సుతో అన్ని పనులను చేస్తే విజయం సాధిస్తారు. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ ఆలోచించవద్దు. కోపం కారణంగా వ్యాపారంలో నష్టాలుంటాయి. (వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


మిథున రాశి


ఈ రోజు మీకు ఉద్యోగ ప్రతిపాదనలు రావొచ్చు. మీ పనిని మీరు శ్రద్ధగా చేస్తారు. భాగస్వామ్య  వ్యాపారంలో డబ్బు సమకూరుతుంది.  ఇంటి వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది. రాజకీయ సంబంధాల నుంచి మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు.(మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


కర్కాటక రాశి


ఈ రోజు మీరు కష్టపడాల్సి ఉంటుంది. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దొద్దు. నిర్మాణ పనులకు సంబంధించిన వ్యవహారాల్లో సవాళ్లుంటాయి. తెలియని వ్యక్తుల దగ్గర అతిగా చర్చించవద్దు. గతంలో మిస్సైన ఛాన్స్ ఇప్పుడు పొందే అవకాశం ఉంది.  (కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)   


సింహ రాశి


ఓ వివాదం నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో మీ ఆలోచనలు పంచుకోవడం ద్వారా రిఫ్రెష్ అవుతారు. మీపై మీకున్న విశ్వాసాన్ని పెంచుతుంది. అవివాహితులు వివాహం చేసుకునే అవకాశం ఉంది. ప్రతికూల వ్యక్తుల నుంచి దూరంగా ఉండడం మంచిది.  (సింహరాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


కన్యా రాశి


ఈ రోజు వ్యాపారంలో అస్థిరత ఉంటుంది. మాట్లాడేటప్పుడు పరుష పదాలు వినియోగించవద్దు. మీరు విమర్శలు చేసినప్పుడు వాటిని తిరిగి మీపై వాళ్లు ప్రయోగిస్తారని తెలుసుకోండి. సోమరితనం కారణంగా మీ పనికి అంతరాయం ఏర్పడుతుంది. చట్టపరమైన విషయాల్లో తప్పులు చేయొద్దు. ( కన్యారాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


తులా రాశి


ఈ రోజు మీరు ప్రారంభించిన పని తక్కువ కష్టంతోనే పూర్తవుతుంది. ఉద్యోగంలో మార్పులు చేసేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఉన్నత చదువుకోసం అడుగులు ముందుకేస్తారు. క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. తులారాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి


వృశ్చిక రాశి


ఈ రోజు ఆర్థికంగా బలోపేతం చెందుతారు. దిగుమతి-ఎగుమతి వ్యాపారంలో లాభం ఉండవచ్చు. మీ ప్రజా సంబంధాల పరిధి విస్తృతంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉండొద్దు. వివాదాలకు బదులు శాంతియుతంగా సమస్యలు పరిష్కారం చేసుకోవడం మంచిది. మీ రాశి ఉగాది 2025 ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


ధనుస్సు  రాశి


మీరు ఈ రోజు మీ మనసులో మాట వ్యక్తం చేయొచ్చు. రోజంతా సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి సలహాతో పని ప్రారంభిస్తే సక్సెస్ అవుతారు. బంధువులు ఇంటికి వస్తారు. గ్రూప్ గా అడుగు ముందుకువేస్తే అనుకున్న పనులు పూర్తవుతాయి. 


మకర రాశి


ఈ రోజు ప్రతికూల ఆలోచనల కారణంగా మీ మనసు గందరగోళంగా ఉంటుంది. ప్రకృతిలో కొంత సమయం గడిపేందుకు ప్లాన్ చేసుకోండి. అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి పొందడంలో ఇబ్బంది ఉంటుంది. ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు చేయండి. నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల  సలహాలు తీసుకోండి.


కుంభ రాశి


ఈ రోజు మీ ఏకాగ్రత, అంకిత భావం మంచి విజయాలు సాధించి పెడుతుంది. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. నిరాశ దరి చేరనివ్వొద్దు. ఇంటిని మరింత మెరుగుపర్చుకుంటారు. రచనా రంగంలో ఉండేవారు గౌరవం పొందుతారు.


మీన రాశి
 
మీ పనిలో ఉన్నతాధికారుల జోక్యం అధికంగా ఉంటుంది. ఇతరులు చేసే విమర్శలను పట్టించుకోవద్దు. సోమరితనం దరి చేర నీయోద్దు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఎవర్నీ అంత తేలిగ్గా నమ్మేయవద్దు. 


గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.