మార్చి 14 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీరు పని ఒత్తిడి పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలపై కోపం తెచ్చుకుంటారు..ఇది మీ వైవాహిక జీవితంపై ప్రభావం పడుతుంది. కొత్త ఇల్లు ఇంటి నిర్మాణంలో ఉంటే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. సామాజిక జీవితం మరింత చురుకుగా ఉంటుంది. ( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
వృషభ రాశి
ఈ రోజు మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఉద్యోగం చేసే ప్రదేశంలో మీ ఆదిపత్యం పెరుగుతుంది. అనారగ్య సమస్యలు మెరుగుపడతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఈ రోజంతా హోలీ సంబరాల్లో మునిగితేలుతారు.(వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
మిథున రాశి
ఈ రోజు మీరు పరధ్యానంగా ఉంటారు. ఈ రోజు కొద్దిసేపు సంతోషంగా ఉంటారు, కొద్దిసేపు నిరాశకు గురవుతారు. ఈ రోజు ఎవరినీ ఎక్కువగా నమ్మేయవద్దు. ముఖ్యమైన పనులు ఈ రోజు చేయకండి. కఠినమైన పదాలు వినియోగించవద్దు. (మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కర్కాటక రాశి
ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు అధిగమిస్తారు. చేయాల్సిన పనులపై శ్రద్ధ పెరుగుతుంది. ప్రభుత్వ వ్యవహారాలు పెండింగ్ లో పడతాయి. ఓ శుభవార్త వినే అవాకాశం ఉంది. ఆర్థికపరంగా అదృష్టం కలిసొస్తుంది. (కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
సింహ రాశి
వ్యాపార సంబంధిత వ్యాపారంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఉన్నతస్థానంలో ఉండేవారి మాటకు గౌరవం పెరుగుతుంది. సామాజిక సేవపై ఆసక్తి చూపిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ లోపాలను సరిదిద్దుకునేందుకు ఈ రోజు మంచిది.
కన్యా రాశి
ఈ రోజు మీరు ఆర్థికంగా నష్టపోతారు. మీ ప్రియమైనవారు మీపై కోపంగా ఉంటారు. ఈరోజు పర్యటనలకు మంచిది కాదు. నూతన ఒప్పందం ఖరారు చేసుకునేందుకు మంచిది. పరిశోధనపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో అసమ్మతి వాతావరణం ఉంటుంది.
తులా రాశి
ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలుంటాయి. మీకు రహస్య అధ్యయనంపై ఆసక్తి ఉంటుంది. తెలివైన నిర్ణయాలు తీసుకోలేరు. తప్పుడు వ్యక్తులకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంపై దృష్టి పెడతారు. వైవాహిక జీవితంలో అసమ్మతి ఉంటుంది. జీవిత భాగస్వామికి మీరు ప్రత్యేక సమయం ఇవ్వాలి. కోపంగా ఉండకండి . విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
ధనుస్సు రాశి
మీ మనస్సు అసంతృప్తిగా ఉండవచ్చు. మీరు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. మాదకద్రవ్యాల వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. వృద్ధులు ఎముకల నొప్పితోబాధపడతారు.
మకర రాశి
ఈ రోజు మీరు పని విషయంలో సోమరిగా వ్యవహరిస్తారు. ఏ పనిపై ఆసక్తి ఉంటే అదే చేయడం మంచిది. ఈ రాశి మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏ విషయంలోనూ ఎవరిపైనా ఆధారపడొద్దు.
కుంభ రాశి
వ్యాపారంలో మీరు భాగస్వాములపై చాలా శ్రద్ధ వహించాలి. మీరు బలవంతంగా చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. ఆహారంపై ఆసక్తి ఉండదు. అనవసరమైన పనుల్లో సమయాన్ని వృథా చేయవద్దు.
మీన రాశి
ఈ రోజు పూర్వీకుల ఆస్తి నుంచి మీకు ప్రయోజనం చేకూరుతుంది. కొత్త ప్రాజెక్టు ప్రారంభించవచ్చు. అనారోగ్య సమస్యలతో ఉండేవారికి కొంత రిలీఫ్ ఉంటుంది. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు.
గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.