Horoscope 4th September 2022: ఈ రోజు కుంభ రాశి వారికి వ్యాపారంలో కొన్ని హెచ్చు తగ్గులు ఉండవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సెప్టెంబరు 4 శనివారం రోజు ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
మేష రాశి
ఈ రోజు మేషరాశివారి వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులుకు బాగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. నూతన వస్త్రాలు,ఆభరణాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు జోరుగా సాగుతాయి.
వృషభ రాశి
మీ తల్లిదండ్రులతో సత్సంబంధాలు కొనసాగించండి. మీ పనితీరుతో పసంశలు అందుకుంటారు. మీకు ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. అపరిచితులపట్ల జాగ్రత్త వహించండి. గాయపడే ప్రమాదం ఉంది జాగ్రత్త. వ్యాపార ప్రణాళికలు విజయవంతం అవుతాయి.
మిథున రాశి
ఈ రోజు మిథున రాశి వారికి ప్రమోషన్ లభిస్తుంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ పురోగతికి దారులు తెరుచుకుంటాయి. అవసరం అయినవారికి సహాయం చేస్తారు.ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం.
కర్కాటక రాశి
ప్రేమికులకు మంచి రోజు.. పెళ్లిచేసుకునే ఉద్దేశం ఉంటే ఆ దిశగా అడుగువేసేందుకు మంచి రోజు ఇది. ఆర్థికంగా అనుకూలమైన రోజు. రాజకీయాల్లో ఉన్నవారికి శుభసమయం. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకండి.
ALso Read: కన్యారాశిలోకి సూర్యుడు, ఈ నాలుగు రాశులవారికి మామూలుగా లేదు!
సింహ రాశి
ఈ రోజు సింహరాశివారికి పనిపట్ల అంతగా శ్రద్ధ ఉండదు. ఏ పని మొదలుపెట్టినా సగంసగమే చేస్తారు. మీ గౌరవానికి భంగం కలగకుండా చూసుకోండి. ఆదాయం మాట పక్కనపెడితే ఖర్చులు తగ్గించేందుకు ప్రయత్నించండి. వైవాహిక జీవితాన్ని అత్యంత సంతోషంగా గడుపుతారు.
కన్యారాశి
కన్యా రాశి వ్యాపారులు ఈ రోజు వ్యాపారం గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి. ఉన్నతాధికారుల నుంచి మాటపడకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. మీరు మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలను వెతుక్కుంటారు. ఆరోగ్యం బావుంటుంది. ఏ పని అయినా మధ్యలోనే నిలిచిపోతుంది.
తులా రాశి
మీకు పెద్ద కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు లాభపడతారు. మీ మనస్సులో సానుకూల ఆలోచనలు ఉంచేందుకు ప్రయత్నించండి. తీసుకున్న అప్పులు చెల్లించేందుకు అనుకూలమైన రోజు. ప్రేమికులకు మంచి రోజు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారు కుటుంబ సభ్యులతో సంతోష సమయం గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి.
ధనుస్సు రాశి
ఈ రోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇతరులు ఏం చెబుతున్నారో పూర్తిగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కళారంగంతో అనుబంధం ఉన్నవారు ఈరోజు విజయాన్ని పొందుతారు.
Also Read: ఈ రాశులవారికి శాంతి, ఆ రాశులవారికి అశాంతి- సెప్టెంబరు నెల రాశిఫలాలు!
మకర రాశి
మీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోండి. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగులకు మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. విద్యార్థులు చదువుపైనే దృష్టిపెట్టాలి.
కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశి వారికి వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఓర్పు, ధైర్యంతో పని చేయండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది.జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
మీన రాశి
ఈ రోజు మీనరాశివారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.