TDP Chennupati Gandhi : టీడీపీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ పై  చెన్నుపాటి గాంధీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజకీయ కారణాలే ఆ దాడికి కారణమని  టీడీపీ నాయకులు అనమానం వ్యక్తం చేస్తున్నారు.  విజయవాడ పడమట డీ మార్ట్ వద్ద ఆ దాడి జరిగింది.  చెన్నుపాటి గాంధీపై దాడిని టీడీపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. దాడి విషయం తెలుసుకొని తాడిగడప ఎల్‌.వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వద్దకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ శ్రేణులు చేరుకున్నారు.  వల్లూరు ఈశ్వర్ ప్రసాద్, వైసీపీ నాయకులు గద్దె కళ్యాణ్, సుబ్బు, మరో ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడింది దేవినేని అవినాష్‌ అనుచరులేనని అంటున్నారు.  


చంద్రబాబు ఫోన్ 


దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు.  దాడిలో గాంధీ కంటికి తీవ్ర గాయం అయిందని ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, పార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, కంటి చూపునకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్న సమాచారంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  మెరుగైన చికిత్స అందేలా చూడాలని నేతలకు సూచించారు. 






దాడికి పాల్పడిన ప్రతీ ఒక్కరికీ శిక్ష తప్పదు- అచ్చెన్నాయుడు


టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్జీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సీఎం జగన్ అండతోనే వైసీపీ నేతలు పగ్గాలు తెంచుకున్న ఆoబోతుల్లా  దాడులకు తెగబడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు.  వైసీపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతల అరాచకాలకు హద్దు, అదుపు లేకుండా పోతోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.  విజయవాడలో ఓ చోటా నాయకుడు వీధి రౌడీలను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు.  టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న వారి పేర్లు, దాడుల్ని ప్రోత్సహిస్తున్న వారి పేర్లు రెండు ఎక్సెల్ షీట్లలో రాస్తున్నామన్నారు. లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదన్నారు. అధికార మదంతో ఇప్పుడు అరాచకాలకు పాల్పడుతున్న వారిని ప్రజలే రోడ్ల మీదికి లాక్కొచ్చి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. 


Also Read : Nara Lokesh On Anna Canteen : ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహిస్తాం, తెనాలి ఘటనపై లోకేశ్ ఫైర్


Also Read : Chittoor News : భూమి కోసం తహసీల్దార్ ఆఫీసులో రైతు దీక్ష, ఆవేదనతో ఆగిపోయిన గుండె!