యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా తన ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో చేస్తున్న సినిమా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. 'SR కళ్యాణమండపం' లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 'రాజావారి రాణిగారు', 'ఎస్ఆర్ కళ్యాణమండపం' లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ఇందులో చాలా కొత్తగా కమర్షియల్ గా కనిపిస్తున్నారు.
ఈ మధ్యే విడుదలైన సినిమా టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్బుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని లహరి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. కిరణ్ అబ్బవరం మాస్ లుక్ లో అందర్ని ఆకట్టుకుంటున్నాడు.
ఈ సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే అదే రోజున బాలీవుడ్ భారీ సినిమా 'బ్రహ్మాస్త్ర' విడుదల కానుండడంతో.. ఆ సినిమాకి పోటీగా కిరణ్ అబ్బవరం తన సినిమాను రిలీజ్ చేయాలనుకోవడం వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు ఈ పోటీ నుంచి కిరణ్ అబ్బవరం తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సెప్టెంబర్ 16కి సినిమాని వాయిదా వేశారు. 'డేట్ మారుతుంది అంతే.. ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా' అంటూ క్యాప్షన్ ఇచ్చారు కిరణ్ అబ్బవరం.
Kiran Abbavaram: 'బ్రహ్మాస్త్ర'తో పోటీ - పక్కకు తప్పుకున్న యంగ్ హీరో!
ABP Desam
Updated at:
03 Sep 2022 08:47 PM (IST)
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా రిలీజ్ డేట్ మారింది.
'బ్రహ్మాస్త్ర'తో పోటీ - పక్కకు తప్పుకున్న యంగ్ హీరో!
NEXT
PREV
ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సత్య గమిడి - శరత్ చంద్ర నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియల్, సహ నిర్మాత: బాబు, సంగీతం: చైతన్ భరద్వాజ్.
ఇక 'బ్రహ్మాస్త్ర' సినిమా విషయానికొస్తే.. నార్త్ తో పాటు తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటకలోని బెంగళూరు వంటి నగరాల్లో కూడా 'బ్రహ్మాస్త్ర' బుకింగ్స్ బావున్నాయి. దక్షిణాదిలో విపరీతంగా ప్రచారం చేయడం కూడా ప్లస్ అయ్యింది. హైదరాబాద్‌లోని కొన్ని మల్టీప్లెక్స్‌లలో త్రీడీ సినిమా టికెట్ రేటు 300 వందలు పెట్టినప్పటికీ... కొందరు ప్రేక్షకులు బుక్ చేసుకుంటున్నారు. సినిమా హిట్ అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా నమోదు చేసే అవకాశం ఉంది.
'బ్రహ్మాస్త్ర'కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లో కొత్త పెళ్లి జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన తొలి చిత్రమిది. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల చేస్తున్నారు.
Published at:
03 Sep 2022 08:47 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -