జనవరి 31 రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశివారికి సమాజంలో కీర్తి పెరుగుతుంది. మీ ప్రమోషన్ గురించి అధికారులు చాలా చురుకుగా ఉంటారు. వృత్తిపరమైన పరిస్థితులు కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. వ్యాపారంలో చాలా లాభాలుంటాయి. జీవిత భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారు.
వృషభ రాశి
ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. చేసే పనిలో తొందరపాటు వద్దు. మీరున్న రంగంలో సమర్థవంతంగా పనిచేస్తారు. రియల్ ఎస్టేట్ సంబంధిత ప్రాజెక్టులు నగదు సమస్యలు పరిష్కరిస్తాయి. ఉద్యోగులు ఉన్నత స్థానం పొందే అవకాశాలున్నాయి. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు మాటకు ప్రభావం పెరుగుతుంది.
మిథున రాశి
మీ తీరు ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారంలో రుణాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. క్లిష్టమైన సమస్యలు పరిష్కారంలో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి అడుగు ముందుకుపడుతుంది.
Also Read: ఈ ఏడాది వసంతపంచమి ఎప్పుడొచ్చింది .. విశిష్టత ఏంటి , సరస్వతీ దేవి పూజా విధానం ఇదే!
కర్కాటక రాశి
మీ శత్రువులు చురుగ్గా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణంలో తెలియని వ్యక్తులతో అతి పరిచయం పెంచుకోవద్దు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. స్నేహితులను కలుస్తారుు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశికి చెందిన వారికి అనారోగ్య సమస్యలుంటే అవి మరింత పెరుగుతాయి. అవసరం లేకుండా ప్రయాణం చేయవద్దు. వృధా ఖర్చులు తగ్గించండి. చేయాల్సిన పనులు పూర్తిచేయండి. ఆదాయం బాగానే ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గించండి. చేయాల్సిన పనులు వాయిదా వేయండి.
కన్యా రాశి
పెద్దవారి నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. చేపట్టిన పనిలో అర్థవంతమైన ఫలితాలు పొందుతారు. ఇతరుల తప్పులు భర్తీ చేసేందుకు ప్రయత్నించండి. పెండింగ్ లో ఉన్న పనులు తిరిగి ప్రారంభమవుతాయి. కుటుంబ సభ్యులతో వివాద సూచనలున్నాయి జాగ్రత్త.
తులా రాశి
సహనం లేకపోవడం వల్ల అనవసరమైన విషయాల గురించి ఎక్కువ టెన్షన్ పడతారు. ఎంతో కష్టపడితే కానీ సాధారణ ఫలితాలు సాధించలేరు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి. నూతన పెట్టుబడులు పెట్టొద్దు.
వృశ్చిక రాశి
మీ అభిప్రాయాలు చెప్పేముందు మీరు మాట్లాడే విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉండండి. ఆర్థిక ఇబ్బందులుంటాయి. శత్రువుల నుంచి హాని పొంచి ఉంది అప్రమత్తంగా ఉండండి. గుండె రోగులు అధిక ఒత్తిడి తీసుకోవద్దు. మేధోపరమైన చర్చల్లో పాల్గొంటారు. రక్తహీనత కారణంగా బలహీనంగా ఉంటారు.
Also Read: మాఘ గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు.. విశిష్టత, పూజా విధానం ఏంటి!
ధనస్సు రాశి
ఈ రోజు మీరు ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. చేపట్టాల్సిన పనిని వాయిదా వేయకండి. లక్ష్యాలను చేరుకునేవరకూ వెనకడుగు వేయవద్దు. పిల్లలకు సంబంధించిన ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
మకర రాశి
ఈ రోజు మీరు వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి వాహన ప్రమాద సూచనలున్నాయి. ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి.
కుంభ రాశి
కమీషన్ సంబంధిత వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందలేరు. ప్రియమైనవారితో మాటతూలకండి. కుటుంబ వాతావరణంలో ఇబ్బంది ఉంటుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. విద్యార్థులు పక్కదారి పట్టొద్దు.
Also Read: మాఘ మాసం మొదలు .. వివాహాది శుభాకార్యాలకు ముహూర్తాలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు!
మీన రాశి
తప్పనిసరి అయితే కానీ ఎక్కువ దూరం ప్రయాణించడం మంచిది కాదు. మీ పనితీరులో మార్పులు చేయాల్సి వస్తుంది. ఆకస్మికంగా ఆర్థిక నష్టం రావొచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీకు చిన్న చిన్న విభేదాలుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు వద్దు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.