జనవరి 30 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీ సామాజిక పరిధి పెరుగుతుంది. మీరు పాత విషయం గుర్తుంచుకోవడం ఆనందంగా ఉంటుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. సృజనాత్మక రచనలపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం పొందుతారు. రిస్క్ తీసుకోవద్దు.
వృషభ రాశి
ఈ రోజు మీరు మీ లక్ష్యం దిశగా అడుగు వేస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యక్తిత్వం సానుకూలంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. చాలా రోజులుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మిథున రాశి
మీ ప్రత్యర్థులను అస్సలు విస్మరించవద్దు. అత్యంత ముఖ్యమైన విషయం, తప్పదు అనుకుంటే కానీ మీకు సంబంధించిన ఏ విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
Also Read: మాఘ మాసం మొదలు .. వివాహాది శుభాకార్యాలకు ముహూర్తాలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు!
కర్కాటక రాశి
ఆరోగ్యం బావుంటుంది. శుభకార్యంలో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకుంటారు. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి ఈ రోజు మంచిది. ఖర్చులు తగ్గించండి . రోజంతా సంతోషంగా ఉంటారు.
సింహ రాశి
ఏప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ప్రభావవంతమైన వ్యక్తుల పరిచయాలు మీకు లాభిస్తాయి.
కన్యా రాశి
ఈ రోజు అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దూరదృష్టి ఆలోచన కారణంగా వ్యాపారంలో ప్రయోజనం ఉంటుంది. సామాజిక సంబంధాలు బలపడతాయి. మీ సహోద్యోగులతో పోటాపోటీ వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి.
తులా రాశి
అహంకారంతో ప్రవర్తించవద్దు...కుటుంబంలో చీలికలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. విద్యార్థులు ఫ్యూచర్ గురించి ఆందోళన చెందుతారు.అనారోగ్య సమస్యలుంటాయి.
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు మీ పనిని చాలా తేలికగా చేస్తారు. వ్యాపార సమస్యలను పరిష్కరించడంలో బిజీగా ఉంటారు. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. మీ ప్రియమైనవారతో సంతోష సమయం గడుపుతారు. ఆరోగ్యం బలహీనంగా అనిపిస్తుంది.
Also Read: కుంభం నుంచి మీనం లోకి శుక్రుడు.. ఈ 5 రాశులవారికి ప్రయోజనం..మిగిలిన వారు అప్రమత్తం!
ధనుస్సు రాశి ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!
ఈ రాశికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జరుగుతుంది. పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.వైవాహిక జీవితం బావుంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. సానుకూల ఆలోచనలు ఉంటాయి.
కుంభ రాశి
సోమరితనం కారణంగా చేపట్టిన పని అసంపూర్ణంగా ఉంటుంది. సాంకేతిక రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులకు కలిసొచ్చే సమయం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు
మీన రాశి
ఈ రోజు మీరు మీ బాధ్యతలను నెరవేర్చినందుకు ఉన్నతాధికారుల నుంచి అవార్డులు పొందుతారు. కొన్నాళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి స్నేహితులతో చర్చిస్తారు.
Also Read:
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.