Horoscopes for Venus in Pisces 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు అందం, కళ, ఆనందం, శ్రేయస్సుకి మూలం అయిన గ్రహం. జనవరి 28 నుంచి మీనంలోకి ప్రవేశిస్తుంది.. మార్చి 02 వరకూ ఇదే రాశిలో ఉంటుంది. ఈ సమయంలో శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావం మీ రాశిపై ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి.
మేష రాశి
మీనంలో శుక్రుడి సంచారం మీ కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. కార్యాలయంలో మీకు పెద్ద బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారంలో ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం పట్ల అవగాహన అవసరం. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి
వృషభ రాశి
శుక్రుడి సంచారం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. మంచి ఉద్యోగం సాధించాలన్న యువత కల నెరవేరుతుంది. దాంపత్య జీవితంలో పరస్పర సామరస్యం చాలా బాగుంటుంది.
Also Read: ఈ వారం ఈ రాశులవారు బాగా సంపాదిస్తారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు!
మిథున రాశి
మీ రాశి నుంచి పదో స్థానంలో శుక్రుడి సంచారం మీకు అంత మంచి ఫలితాలను అందివ్వడం లేదు. ఈ సమయంలో మీరు చేసే పని పట్ల కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. కార్యాలయంలో విజయాన్ని సాధించడంలో మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపార సంస్థల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. ప్రేమ సంబంధాలలో తొందరపడకండి
కర్కాటక రాశి
మీన రాశిలో శుక్ర సంచారం మీకు మంచి చేస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రేమ వివాహాలకు కుటుంబాల నుంచి మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకోసం డబ్బు వెచ్చిస్తారు. ఇతరులపై ఎక్కువ ఆధారపడొద్దు. నూతన పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. రిస్క్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి
సింహ రాశి
జనవరి 28 నుంచి మార్చి 2 వరకూ శుక్రుడి ప్రభావంతో మీరు శారీరకంగా మానసికంగా కొంత బలహీనంగా అనిపించవచ్చు. చెడు వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండండి. మీరు అనుకున్న పని పూర్తిగా విజయవంతమవుతుంది. మీరు నమ్మినవారే మీకు ద్రోహం చేస్తారు.
Also Read: జనవరి 27 నుంచి ఫిబ్రవరి 02 వరకూ ఈ వారం ఈ 4 రాశులవారికి ఆర్థికంగా కలిసొస్తుంది!
కన్యా రాశి
శుక్రుడు మీకు ఆర్థిక లాభాలు అందిస్తాడు. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో సమన్వయం బావుంటుంది. వ్యాపారంలో పెద్ద మార్పులు చేర్పులు చేయవద్దు. కొత్త మూలల నుంచి ధనం పొందుతారు. ప్రేమ సంబంధాలు కలిసొచ్చే సమయం ఇది.
తులా రాశి
మీ రాశి నుంచి ఆరో స్థానంలో శుక్ర సంచారం ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. మీ పనితీరులో మార్పులు చేయాల్సి వస్తుంది. స్నేహితుల నుంచి సహకారం పొందుతారు. నూతన ఉద్యోగం వెతుక్కుంటున్నవారు శుభవార్త వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
మీనంలో శుక్రుడి రాశి పరివర్తనం మీ పనితీరును మెరుగుపరుస్తుంది. కుటుంబంలో స్త్రీల విషయంలో కొన్ని చికాకులుంటాయి. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు పొందుతారు. పిల్లల పురోభివృద్ధితో మనసు ఆనందంగా ఉంటుంది.
Also Read: ఈ వారం ఈ 4 రాశులవారు వృత్తి, ఉద్యోగాల్లో మంచి పురోగతి సాధిస్తారు!
ధనుస్సు రాశి
మీ రాశి నుంచి నాలుగో స్థానంలో శుక్రుడి సంచారం మీ కుటుంబంలో ఆనందాన్నిస్తుంది. ఆస్తి కొనుగోలు దిశగా అడుగులు వేసేవారు జాగ్రత్తగా ఆలోచించి దిగండి. నిరుద్యోగులు కెరీర్లో లాభపడతారు. దూరప్రయాణాలు కలిసొస్తాయి. కళలు, సాహిత్యంపై ఆసక్తి పెరుగుతుంది.
మకర రాశి
శుక్రుడి రాశి పరివర్తనం మీరున్న రంగంలో మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్లవచ్చు. అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది.
కుంభ రాశి
మీ రాశి నుంచి మీనంలోకి ప్రవేశించాడు శుక్రుడు. ఫలితంగా జనవరి 28 నుంచి మార్చి 02 వరకూ మీరు ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ సమాచారం వింటారు. అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి. స్నేహితులపై ఎక్కువగా ఆధారపడవద్దు.
మీన రాశి
మీ రాశిలో శక్రుడి సంచారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో అవివాహితులు పెళ్లి విషయంలో ఓ అడుగు వెనక్కు వేయడమే మంచిది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఉద్యోగులు, వ్యాపారులు కష్టపడితే కానీ మంచి ఫలితాలు సాధించలేరు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.