జనవరి 29 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. మీలో పోటీతత్వం పెరుగుతుంది. విదేశాలలో పనిచేసే వారి ఆదాయం పెరుగుతుంది. డబ్బు,  కెరీర్ పరంగా ఈ రోజు మీకు కలిసొస్తుంది. ఈ రోజు మీరు కొత్త పథకాలపై పని చేయవచ్చు. 


వృషభ రాశి


ఈ రోజు ఆర్థిక విషయాలు మీకు కలిసొస్తాయి. మీ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. వివాహిత సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. లావాదేవీల పరంగా మీరు చాలా అదృష్టవంతులు.  అసంపూర్ణమైన పనులను పూర్తి చేస్తారు. పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకుంటారు. 


మిథున రాశి


ఈ రోజు సోమరితనంతో సమయాన్ని వృధా చేయవద్దు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.  మీ భావాలను అగౌరవపరిచేవారున్నారు జాగ్రత్త.  నిర్వహణతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి లోపాలను పరిశీలించుకోవాలి.


కర్కాటక రాశి


ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శుభకార్యాలకు హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటారు. విదేశాలలో వ్యాపారం చేసేవారికి ఈ రోజు మంచిది. ఖర్చులు నియంత్రించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది.


Also Read: మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!


సింహ రాశి


ఈ రోజు మీరు నూతన విషయాలు అధ్యయనం చేయడంపై ఆసక్తి చూపిస్తారు. సమస్య చిన్నదే కదా అని విస్మరించవద్దు. రహస్య శత్రువులున్నారు జాగ్రత్తపడండి. ఆరోగ్యం, ఆదాయం బావుంటుంది.  


కన్యా రాశి


ఈ రోజు ఈ రాశివారికి పని ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి ప్రభావం ఇంటి సభ్యులపై చూపిస్తారు. మాటలు దొర్లనీయకండి. మీ ప్రవర్తనలో పారదర్శకత అవసరం. ప్రేమ వివాహాలకు కలిసొచ్చే సమయం ఇది. 


Also Read:  మహా కుంభమేళాలో భారీ తొక్కిసలాట.. మౌని అమావాస్య రోజు జరిగిన ఘటన 70 ఏళ్లు గడిచినా వణికిస్తూనే ఉంది!


తులా రాశి


ఈ రోజు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఏదో విషయంలో అసంతృప్తి ఉంటుంది. వాహనం పనిచేయకపోవడం కారణంగా ఇబ్బందిపడతారు. చేపట్టిన పనుల్లో తొందరపాటు తగదు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.


వృశ్చిక రాశి


అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి..మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఊహించిన పలితాలు పొందుతారు. ఉన్నతాధికారులతో సత్సంబంధాలుంటాయి. తప్పనిసరి అయితే కానీ ప్రయాణం చేయడం సరికాదు. వ్యాపారులు ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. 


ధనస్సు రాశి


ఈ రోజు మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీ తీరులో వినయం ఉండేలా చూసుకోండి. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలుంటాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామి సహకారంతో చేపట్టే పనులు విజయవంతం అవుతాయి. 


మకర రాశి


ఈ రోజు మీరు చేసే ప్రతి పనిలోనూ మంచి ఫలితాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై విశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన సమస్యల గురించి ఉన్నతాధికారులతో ఉద్యోగులు చర్చిస్తారు. వ్యాపారంలో లాభావుంటాయి.అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు.


Also Read: మౌని అమావాస్య రోజున కుంభమేళాకు వెళ్తున్నారా - సంగంలో స్నానం చేసే విధానం, పాటించాల్సిన నియమాలివే


కుంభ రాశి


ఈ రోజు ప్రతికూల ఆలోచనలు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే సానుకూలంగా ఉండండి. ప్రేమ సంబంధాలలో కొన్ని తేడాలు ఉండవచ్చు. మీ పట్ల సహోద్యోగుల ప్రవర్తన సరిగా ఉండదు. కొత్త వ్యవహారాలు, కొత్త రచనలు ఏవీ ఈ రోజు ప్రారంభించవద్దు. 


మీన రాశి


ఈ రాశివారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో భాగోద్వేగానికి గురవుతారు. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల కొనుగోలు ప్రణాళికలు వేసుకుంటారు. పిల్లలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. 


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.