Kia Syros vs Skoda Kylaq: స్కోడా కైలాక్ గతేడాది డిసెంబర్ ప్రారంభంలో భారత మార్కెట్లోకి విడుదలైంది. ఈ వాహనంపై ప్రజల్లో చాలా మంచి క్రేజ్ ఉంది. ఈ స్కోడా కారు రూ.7.89 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది. ఇప్పుడు ఈ వాహనం డెలివరీ ప్రారంభమైంది.
దీనికి పోటీగా మార్కెట్లో ఉన్న కారులు గురించి మాట్లాడితే... ఆ స్థాయి స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్న ఇటీవలే అమ్మకాలు ప్రారంభించిన కియా స్కిరోస్ భారతీయ మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కియా స్కిరోస్ ధర గురించి చూస్తే రూ. 9.7 లక్షల నుంచి మొదలై రూ. 16.5 లక్షల వరకు ఉంటుంది.
Also Read: వాహన రంగానికి కావాలి వరాలు - నిర్మలమ్మ కనికరిస్తే భారీగా తగ్గుతుంది బండి రేటు!
స్కోడా కైలాక్
స్కోడా కైలాక్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 114 bhp పవర్‌ను 178 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కోడా కారు ఇంజిన్‌తోపాటు, 3-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ కారు అద్భుతమైన నిర్మాణ నాణ్యతతో వస్తుంది. ఇది అద్భుతమైన రైడ్, హ్యాండ్లింగ్ బ్యాలెన్స్ కలిగి ఉంది. స్కోడా కైలాక్ ఆన్-రోడ్ ధర రూ. 8.87 లక్షల నుంచి మొదలై రూ. 16.23 లక్షల వరకు ఉంది.
కియా సిరోస్
కియా సిరోస్ ఒక కొత్త కాంపాక్ట్ SUV కారు. ఈ కారులో వెనుక సీటు స్థలం కియా సోనెట్ కంటే ఎక్కువగా ఉంటుంది. సోనెట్ వలె కియా సిరోస్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. అదే టైంలో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. ఈ కియా కారులో అనేక పవర్‌ఫుల్ ఫీచర్లు కూడా చేర్చారు.
ఈ వాహనంలో లెవెల్ 2 ADAS, వెంటిలేటెడ్ రియర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అనేక ఫీచర్లు కలిగి ఉంది. భద్రతా రేటింగ్ పరంగా కైలాక్ భారత్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. సైరోస్ ఎటువంటి భద్రతా రేటింగ్‌ను పొందలేదు. మీరు రెండు కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు పొందవచ్చు.
Also Read: బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. మరి మంత్రిగారు కరుణించేనా ?