విశాఖపట్టణం అంటే తనకు ఎంతో ఇష్టమని యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) చెప్పారు. ఆయన కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా సినిమా 'తండేల్' (Thandel ) ట్రైలర్ విడుదల కార్యక్రమం విశాఖలో చేశారు. అక్కడ విశాఖతో తన అనుబంధం, విశాఖ అమ్మాయి శోభిత ధూళిపాళతో ప్రేమ వివాహం, ఇంట్లో ఎవరిది పై చేయి? అనే అంశాల గురించి కూడా మాట్లాడారు.
మా ఇంట్లో వైజాగ్ ఉంది...
ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే!
''నాకు వైజాగ్ అంటే ఎంత ఇష్టం అంటే... నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మా ఇంట్లో వైజాగ్ ఉంది. నా ఇంట్లో రూలింగ్ పార్టీ కూడా వైజాగే. అందువల్ల అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్... 'తండేల్' సినిమాకు విశాఖలో కలెక్షన్లు షేక్ అయిపోవాలి. లేకపోతే ఇంట్లో పరువు పోతుంది ప్లీజ్ సినిమాను హిట్ చేయండి'' అని నాగ చైతన్య చెప్పారు. విశాఖలో సినిమా ఆడితే ప్రపంచంలో ఎక్కడ అయినా సరే సినిమా హిట్ అవుతుందని ఆయన తెలిపారు.
కాన్ఫిడెంట్‌గా చైతూ...
సినిమా గ్యారెంటీ హిట్!
'తండేల్' తప్పకుండా హిట్ అవుతుందని చైతూ విశ్వాసం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు 'వస్తున్నాం... హిట్ కొడుతున్నాం' అని చెబుతారు. ఆ టైపులో నాగ చైతన్య ''ఫిబ్రవరి 7న వస్తున్నాం. దుల్ల కొట్టేస్తున్నాం రాజులమ్మ జాతరే'' అని నాగ చైతన్య చెప్పారు.
ఇంకా నాగ చైతన్య మాట్లాడుతూ... ''పుష్ప కా బాప్ అల్లు అరవింద్ గారు. నా జీవితంలో ఏడాదిన్నర నుంచి ఆయన 'తండేల్'. ఇప్పుడు ఆయన లేకుండా ఇంకో సినిమా ఎలా చేయగలననే ఫీలింగ్ వచ్చేసింది. ఈ సినిమాకు ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు చాలా విలువైనది. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటా'' అని చెప్పారు. (Thandel Release Date) ఫిబ్రవరి 7న తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించారు.
Also Read: 'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
'తండేల్' నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ... ''మేమెంతో కష్టపడి ఈ సినిమా తీశాం. మా కష్టం ఎంతైనా... ప్రేక్షకుల ఆదరణలోనే మా ఆనందం ఉంటుంది. ప్రేక్షకులంతా తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మా దర్శకుడు చందూ మొండేటి ఈ కథను అత్యద్భుతంగా మలిచారు. సాయి పల్లవి అద్భుతంగా నటించింది. నాగ చైతన్య ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సన్నివేశాలు చూస్తే మన గుండె కరిగిపోతుంది. ఈ సినిమాతో నటుడిగా బెస్ట్ అనిపించుకుంటారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంతో చించిపడేశాడు. శ్రీకాకుళంలోని ఒక చిన్న ఊరిలో జరిగిన వాస్తవ కథను సినిమాగా తీశాం. ఉత్తరాంధ్ర వారందరూ ఈ సినిమా చూసి ఆనందిస్తారని నమ్మకం ఉంది'' అని చెప్పారు.
Also Read: 'దిల్' రాజుకు రామ్ చరణ్ మరో సినిమానా? సారీ... ప్రజెంట్ కమిట్మెంట్ ఏదీ లేదు