Fatima Sana Open Up on Casting Couce: 'దంగల్' బ్యూటీ ఫాతిమా సనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తొలి సినిమాతోనే ఏకంగా ఆమిర్ ఖాన్‌తో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ మూవీ దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు ఎక్కింది. రెండు వేలకు పైగా కోట్ల వసూళ్లు చేసిన చిత్రంగా టాప్‌లో ఉన్నంది. ఇప్పటికీ ఆ రికార్డు దంగల్‌పైనే ఉంది. రెజ్లింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. రెజ్లర్‌గా తనదైన నటనతో ఆకట్టుకుటుంది. దీంతో డెబ్యూ చిత్రంతోనే ఫాతిమా స్టార్ యాక్ట్రస్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. గతేడాది ఆదిత్య రాయ్ కపూర్ జంటగా 'మెట్రో ఇన్ డైనో'లో హీరోయిన్‌గా నటిచింది.
కెరీర్ ప్రారంభంలో తాను కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని, అది కూడా టాలీవుడ్ నిర్మాతల నుంచి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ... "ఒకప్పుడు బాలీవుడ్‌లో అవకాశాలు రావాలంటే సౌత్ సినిమాలు బాగా హెల్స్ అయ్యేవి. సౌత్‌లో మంచి సినిమా చేస్తే హిందీలోనూ గుర్తింపు వస్తుంది. దాంతో బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చేవి. నాకు తెలుగులో 'నువ్వు నేను ఒక్కటవుదాం' సినిమా చేశాను. ఈ చిత్రంతోనే నా కెరీర్ మలుపు తిరిగింది. ఈ సినిమా తర్వాత నేను హైదరాబాద్‌లో ఓ చిత్ర నిర్మాతను కలిశాను. అప్పుడు ఆయన నాతో అనుచితం ప్రవర్తించారు. ఆయన మాట్లాడిన మాటలకు చాలా ఇబ్బంది పడ్డాను.
ఒపెన్ గా అడిగేశాడు...
'మీకు ఆఫర్స్ కావాలంటే మేం చెప్పే ప్రతి పని చేయడానికి సిద్ధంగా ఉండాలి, ఏం చేయడానికి అయినా అంగీకరించాలి' అన్నారు. సినిమాకు ఏం అవసరమో నటిగా తాను అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అప్పుడు ఆయన కాస్టింగ్ కౌచ్ గురించి ఒపెన్‌గా మాట్లాడారు. ఆయన మాటలకు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. దాంతో సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాను. అలా కాస్టింగ్ కౌచ్ వల్ల ఎన్నో ఆఫర్స్ వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితులు సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి" అని ఆమె చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో నటీమణులకు ఒక్క కాస్టింగ్ కౌచ్ సమస్య మాత్రమే కాదని, డబ్బుల పరంగానూ మోసపోతున్నారంది. కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ డైరెక్టర్స్ వల్ల కూడా తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది.
Also Read: 'ఛావా' ఒక్కటే కాదు... రష్మిక కంటే ముందు కాంట్రవర్సీలకు కారణమైన టాప్ బాలీవుడ్ హిస్టారికల్ ఫిలిమ్స్
కమిషన్ పేరుతో డబ్బులు తీసుకున్నారు..
కాస్టింగ్ డైరెక్టర్స్ కమిషన్ పేరుతో తమ వద్ద డబ్బులు తీసుకునేవారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కష్టపడి నటిస్తున్న నటులను కమిషన్ పేరుతో మోసం చేసేవారు, ఆడిషన్ పూర్తయ్యాక మా దగ్గర 15 శాతం కమిషన్ తీసుకునేవారు. కమిషన్ తీసుకున్నాకే మాకు పేమేంట్స్ ఇచ్చేశారు. అయితే ఇండస్ట్రీలో అందరు అలా ఉండరని, చెడ్డ వారితో పాటు మంచి వారు కూడా ఉన్నారని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా ఆమిర్ ఖాన్ తన భార్య కిరణ్ రావ్‌కి విడాకులు ఇస్తున్న టైంలో ఫాతిమా పేరు మారుమోగిన సంగతి తెలిసిందే. ఆమిర్ ఆమె రిలేషన్‌లో ఉందని, ఆమె కోసమే ఆమిర్ కిరణ్ రావ్‌కి విడాకులు ఇచ్చాడంటూ రుమార్స్ వినిపించాయి. అంతేకాదు ఆమిర్, ఫాతిమాలు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బి-టౌన్‌లో ప్రచారం కూడా జరిగిన సంగతి తెలిసిందే.