Thandel First Review: 'తండేల్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... ఎడిట్ రూమ్‌లో మూవీ చూసిన అల్లు అరవింద్
Thandel Movie: ఫిబ్రవరి 7న 'తండేల్' థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా విడుదలకు పది రోజులు ముందే ఫైనల్ ఎడిట్ లాక్ చేశారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సినిమా చూశారు. దాంతో ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది.
Allu Aravind Reviews Thandel: 'తండేల్' థియేటర్లలోకి ఫిబ్రవరి 7న రానుంది. విడుదలకు ఇంకా పది రోజుల సమయం ఉంది. అయితే... ఆల్రెడీ ఫైనల్ ఎడిట్ లాక్ చేశారు. అగ్ర నిర్మాత, ఈ చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ ఎడిటింగ్ రూమ్‌లో సినిమా చూశారు. 'తండేల్' చూసిన తర్వాత అల్లు అరవింద్ రియాక్షన్ ఏమిటి? ఆయన నుంచి చిత్ర బృందానికి ఏయే సలహాలు వచ్చాయి? అంటే...
డిస్టింక్షన్... ఫుల్ హ్యాపీగా బన్నీ వాసు!
ఫైనల్ ఎడిట్ సినిమా చూడడానికి ఎడిటింగ్ రూమ్‌లోకి అల్లు అరవింద్ వెళ్లిన తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఒక ట్వీట్ చేశారు. తన పరిస్థితి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న పదో తరగతి విద్యార్థులా ఉందని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం ఆయన మరొక ట్వీట్ చేశారు.
అల్లు అరవింద్ సినిమా చూసిన తర్వాత ఏమన్నారు? అనేది బన్నీ వాసు చెప్పలేదు గానీ... డిస్టింక్షన్ లో పాస్ అయ్యానని ఆయన పేర్కొన్నారు. ఆయన పోస్ట్ చేసిన ఎమోజీలు చూస్తే తాను ఒక ఛాంపియన్ అనే ఫీల్ వచ్చినట్లు అర్థం అవుతోంది. అల్లు యూనివర్సిటీ డీన్ అల్లు అరవింద్ తమ సినిమాకు సూపర్ సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పారు. అల్లు అరవింద్ వందకు వంద మార్కులు ఇచ్చారని గీతా ఆర్ట్స్ సంస్థ పేర్కొంది. ఇక థియేటర్లలోకి రాజులమ్మ జాతరే అని సంతోషం వ్యక్తం చేసింది
Also Read: పద్మ భూషణ్ బాలకృష్ణ కోసం... ఈసారైనా అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వస్తారా?
తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో!
'తండేల్' సినిమాలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన సంగతి తెలిసిందే. 'లవ్ స్టోరీ' తర్వాత వాళ్ళిద్దరూ జంటగా నటించిన చిత్రం ఇది. బ్లాక్ బస్టర్ 'హండ్రెడ్ పర్సెంట్ లవ్' తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థలో నాగచైతన్య నటించిన చిత్రం ఇదే.
'కార్తికేయ 2' సినిమాతో ఇండియా స్థాయిలో భారీ హిట్ అందుకున్న దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వెళ్ళనున్నారు. ఫిబ్రవరి 7న తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. జనవరి 28న సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన బాణీలు అందించిన 'బుజ్జి తల్లి', 'శివ శక్తి', 'హైలెస్సో హైలెస్సా' పాటలకు మంచి స్పందన లభిస్తోంది.
'తండేల్' సినిమా కోసం అక్కినేని నాగ చైతన్య శ్రీకాకుళం యాస నేర్చుకున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలరి పాత్రలో ఆయన నటించారు. వాస్తవంగా జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. చేపల వేటకు వెళ్లిన కొందరు పాకిస్తాన్ సైన్యానికి చిక్కడం, ఆ తరువాత వాళ్ళ చేతిలో చిత్రహింసలు అనుభవించడం వంటి అంశాల నేపథ్యంలో తెరకెక్కించిన దేశభక్తి చిత్రం ఇది.