Horoscope Today 28th April 2024
మేష రాశి
కొత్తగా ఏ కార్యక్రమాలు ప్రారంభించకపోవమే మంచిది. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులుంటాయి. ఆదాయంతో పాటూ ఖర్చులు పెరుగుతాయి. అనవసర కోపం తగ్గించుకోవాలి. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది.
వృషభ రాశి
అలసటగా అనిపిస్తుంది. ప్రతి పనిలో తొందరపాటు, అజాగ్రత్త మానుకోవాలి. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో శాంతిని కొనసాగించేందుకు ప్రయత్నించండి. వాహన సౌఖ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.
మిథున రాశి
నూతన పెట్టుబడులకు ఇదే మంచి సమం. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఇంటి మరమ్మతులకు ఖర్చు చేస్తారు. ఏదో విషయంలో కోపంగా ఉంటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. పోటీ పరీక్షలు లేదా ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలున్నాయి. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
Also Read: త్రిగ్రాహి యోగం ఈ రాశులవారికి లాభం!
కర్కాటక రాశి
ఈ రాశివారు ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు మంచి పలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. చేపట్టే పనిని సమయానికి పూర్తిచేసేందుకు ప్రయత్నించాలి. గతంలో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావొచ్చు. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి.
సింహ రాశి
ఈ రాశివారు ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. ఉద్యోగుల పట్ల కార్యాలయంలో కొంత అసంతృప్తి ఉండొచ్చు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఇంట్లో అశాంతి వాతావరణం ఉంటుంది. ఓ క్షణం కోపం..ఓ క్షణం శాంతంగా ఉంటారు. కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావొచ్చు.
కన్యా రాశి
వ్యాపారంలో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. ప్రతికూల మాటలు వద్దు. శ్వాసకోశ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సంతోషం తగ్గవచ్చు. వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఏదో విషయంలో మనసు కలత చెందుతుంది.
Also Read: మే మొదటివారం ఈ రాశులవారు గుడ్ న్యూస్ వింటారు - ఏప్రిల్ 29 నుంచి మే 05 వారఫలాలు!
తులా రాశి
ఏ పని ప్రారంభించినా అనుకున్న సమయానికి పూర్తి చేసేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు సులభంగా పూర్తవుతాయి. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ కెరీర్ కి సంబంధించి కొత్త ప్రణాళికలు వేస్తారు. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారు ఎవ్వరినీ అతిగా నమ్మొద్దు. గతంలో అప్పుగా ఇచ్చిన మొత్తం మీకు తిరిగి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట తూలొద్దు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు.సోదరుల సహకారంతో ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి
ధనుస్సు రాశి
మీ పని తీరు మెరుగుపడుతుంది. కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగ రీత్యా విదేశీ పర్యటనకు వెళ్లవచ్చు. అదనపు ఖర్చులు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. పోటీ పరీక్ష లేదా ఇంటర్వ్యూలలో శుభ ఫలితాలు పొందుతారు.
Also Read: 'మే' నెల ఏ రాశులవారిని ముంచేస్తుంది - ఏ రాశులవారికి కలిసొస్తుంది!
మకర రాశి
ఈ రాశివారి అదృష్టం ఈ రోజు బాలేదు. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఆశ-నిరాశల మిశ్రమంగా ఆలోచనలుంటాయి. విద్యార్తులు చదువుపై దృష్టి సారించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఉండాలి.
కుంభ రాశి
రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ రోజు మంచి ప్రయోజనాలు పొందుతారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారంలో అధిక ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలు, పోటీ పరీక్షలకోసం ఎదురచూస్తున్నవారు అనుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మీన రాశి
కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఈ రోజు మంచి రోజు. ప్రేమలో ఉండేవారు పెళ్లిచేసుకోవాలి అనుకుంటే మీకు కలిసొచ్చే సమయం ఇది. స్నేహితులను కలుస్తారు. నిలిచిపోయిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. ఉద్యోగులకు శుభసమయం.
Also Read: అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే!
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి...