Trigrahi Yog 2024
మేష రాశి
త్రి గ్రాహి యోగం వల్ల ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీలో సృజనాత్మకత ఉంటుంది. చేసే పనిలో మంచి ఫలితాలు పొందుతారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలు తీరిపోతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
వృషభ రాశి
త్రిగ్రాహి యోగం వల్ల విద్య, వృత్తి, సంపద, వ్యాపారం, వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యల నుంచి ఉపశనం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. పోటీ పరీక్షలలో విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు.
మిథున రాశి
ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. శత్రువులు మీ చేతిలో ఓడిపోతారు. పనుల్లో ఎదురైనా ఆటంకాలు తొలగిపోతాయి.వ్యాపార పరిస్థితి మెరుగుపడుతుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. మీరు జీవితంలోని ప్రతి రంగంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
Also Read: మే మొదటివారం ఈ రాశులవారు గుడ్ న్యూస్ వింటారు - ఏప్రిల్ 29 నుంచి మే 05 వారఫలాలు!
కర్కాటక రాశి
మీ ప్రవర్తన, మాటతీరు ఆకర్షణీయంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పూర్తవుతాయి. కుటుంబంలో సమస్యలు తీరిపోతాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మీడియా , సినిమా రంగాలతో సంబంధం ఉండే వ్యక్తులకు కొత్తమార్గాలుంటాయి.
సింహరాశి
సింహ రాశి వారికి త్రిగ్రాహి యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సమయానికి డబ్బు చేతికందుతుంది. ఆరోగ్యం బావుంటుంది.
కన్యారాశి
త్రిగ్రాహి యోగంవల్ల వ్యాపారులు లాభపడతారు. ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితుల సహాయంతో డబ్బు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
వృశ్చిక రాశి
త్రిగ్రాహి యోగం వల్ల వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం.
ధనుస్సు రాశి
ఈ రాశివారికి ప్రేమ సంబంధాలు బావుంటాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించవచ్చు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
Also Read: 'మే' నెల ఏ రాశులవారిని ముంచేస్తుంది - ఏ రాశులవారికి కలిసొస్తుంది!
మకర రాశి
ఆస్తికి సంబంధించిన వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. మీరు పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. విలాసాలు పెరుగుతాయి.
కుంభ రాశి
మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుం మద్దతు పొందుతారు. మీరు అన్ని రంగాలలో గొప్ప విజయాన్ని పొందుతారు. న్యాయపరమైన విషయాల్లో విజయం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది.
Also Read: అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే!
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి...