Akshaya Tritiya 2024:  మే 10 శుక్రవారం అక్షయ తృతీయ. ఈ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలనే సెంటిమెంట్ చాలామందికి ఉంటుంది. అయితే ఈ రోజు బంగారం వెండి కన్నా కొనుగోలు చేయాల్సిన ముఖ్యమైన వస్తువులు చాలా ఉన్నాయి. 


అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు


బంగారు ఆభరణాలు


అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుందని అనుకుంటారు. అయితే మీ స్తోమతను బట్టి బంగారం కొనుగోలు చేసి దానం చేయడం శ్రేయస్కరం.


వెండి వస్తువులు


బంగారంతో పాటూ వెండివస్తువులు కొనుగోలు చేయడం కూడా మంచిదే. వెండి పాత్రలు, వెండి దీపపు కుందులు కొనుగోలు చేసి మీ సన్నిహితులకు బహుమతిగా ఇవ్వొచ్చు.  వెండి ఆవుని తీసుకొచ్చి ఇంట్లో పూజామందిరంలో అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేయాలనే సెంటిమెంట్ కొందరు అనుసరిస్తారు


Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!


ఆస్తులు
ఈ రోజు ఏం కొన్నా అక్షయం అవుతుందనే ఉద్ధేశంతో చాలామంది స్థిరాస్తులపై పెట్టుబడులు పెడతారు. వాస్తవానికి ఇది మంచిదే. పైగా అక్షయతృతీయ అంటే రోజంతా శుభముహూర్తమే..అందుకే ఈ రోజు ఏ సమయంలో పెట్టుబడులు పెట్టినా భవిష్యత్ లో మంచి లాభాలొస్తాయి. 


షేర్లలో పెట్టుబడి


స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఈ రోజు షేర్లు కొనుగోలు చేస్తే భవిష్యత్ లో భారీగా పెరుగుతాయని నమ్మకం. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం కూడా భవిష్యత్ లో లాభాలు తెచ్చిపెడుతుంది. 


Also Read: అక్షయ తృతీయ ఎప్పుడు - ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి , ఈ రోజు ఏం చేయాలి!


విజ్ఞానాన్నిచ్చే వస్తువులు


పుస్తకాలు, ల్యాప్ టాప్ కొనుగోలు చేసేందుకు అక్షయ తృతీయ మంచి రోజుగా భావిస్తారు.


వాహనాలు


వాహనం కొనుగోలు చేయాలి అనుకునేవారు ఈ రోజు తీసుకుంటే మంచిది. తిథి, వారం, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం, యమగండం ఎలాంటి ప్రభావాలు ఉండవు...మీ నక్షత్రం ప్రకారం మంచి రోజు అవునా కాదా అని చూసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వ్యవసాయంలో ఉపయోగించే ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు కొనుగోలు చేసేందుకు ఇంతకన్నా శుభప్రదమైన రోజు ఉండదంటారు. 


నూతన వస్త్రాలు


సాధారణంగా పండుగల రోజు కొత్త వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఈ రోజు నూతన వస్త్రాలు కొనుగోలు చేసి ధరించడమే కాదు..దానం చేయడం అత్యుత్తమం.  


Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!


దాన ధర్మాలు


అత్యంత ముఖ్యమైన విషయం...అక్షయ తృతీయ రోజు దానం చేయడం. ఎండలు ముదిరే సమయం కాబట్టి కొత్త కుండలో నీళ్లు పోసి దానం చేయడం మంచిది. అన్నదానం చేయడం ఇంకా శుభప్రదం. చెప్పులు, గొడుగు దానం చేయడం వల్ల మీ పుణ్యం అక్షయం అవుతుంది.  


తప్పనిసరిగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనే మాయలో పడొద్దు....


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం


Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!