జనవరి 24 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు ఎక్కువ చర్చల్లో పాల్గొనవద్దు. పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు. చిన్న చిన్న అడ్డంకులను తొలగించడానికి ప్రయత్నించండి. వాతావరణంలో మార్పుల వల్ల అనారోగ్య సమస్యలుంటాయి. వ్యాయామంపై దృష్టి సారించండి.


వృషభ రాశి


ఈ రోజు మీరు పెద్ద వ్యాపార ఆర్డర్‌ను పొందవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రమోషన్ సమాచారం వింటారు. మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ భావం పెరుగుతుంది. సమయాభావం వల్ల ఏదైనా ప్రణాళిక నిలిచిపోవచ్చు. ప్రమాదకర పనులు జాగ్రత్తగా చేయండి. అప్పులు తీసుకునే ప్రక్రియ ఏమైనా పెండింగ్ లో ఉంటే ఈ రోజు పూర్తవుతుంది.


మిథున రాశి


ఈ రోజు మీకు మంచి రోజు. వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. కన్నవారితో మంచి సంబంధాలు మెంటైన్ చేయండి. కుటుంబం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లల పురోభివృద్ధితో మనసు ఆనందంగా ఉంటుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది 


Also Read: మౌని అమావాస్య, శివరాత్రికి భారీ రద్దీలో కుంభమేళాకి పరిగెత్తకండి.. ఇంట్లోనే ఇలా చేయండి చాలు!


కర్కాటక రాశి


మీరు ఈ రోజు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఎలాంటి విభేదాలు పెట్టుకోవద్దు. మీరు ఈ రోజు ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది.  వ్యాపారానికి సంబంధించి పెద్ద ఒప్పందాలు చేసుకోవద్దు.  వైవాహిక జీవితంలో పరస్పర సామరస్యం లోపించవచ్చు


సింహ రాశి


ఈ రోజు అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఇంటి వ్యవహారాల్లో విసుగు చెందుతారు. వాతావరణంలో మార్పు కారణంగా అనారోగ్య సమస్యలుంటాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు ఆలోచిస్తారు. 


కన్యా రాశి


ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్నేహితులు, పొరుగువారి మధ్య మీ గౌరవం పెరుగుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ప్రేమ సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.ఎవరికీ సలహా ఇవ్వకండి.


తులా రాశి


ఈ రోజు మీరు క్రీడా కార్యకలాపాలపై ఆసక్తి చూపిస్తారు. మీ మాటతీరు ఆకట్టుకునేలా ఉంటుంది...అందుకే అంతా మీపట్ల త్వరగా ఆకర్షితులవుతారు. అనుకున్నది సాధించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో సాధారణ పరిస్థితులుంటాయి 


వృశ్చిక రాశి


మీరు గౌరవం ఇచ్చి పుచ్చుకోండి. వ్యాపార విస్తరణకు కృషి చేస్తారు. మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పునఃప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. మీరు ఆకస్మిక ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. 
 
ధనస్సు రాశి


ఈ రోజు నిర్వహణతో సంబంధం ఉన్న వ్యక్తులు సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు చెడు వార్తలు వినాల్సి రావొచ్చు. అనవసర ప్రయాణాలు చేయొద్దు. తప్పుడు సలహాలు, తప్పుడు సహవాసాలు మిమ్మల్ని చాలా నష్టపరుస్తాయి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఓపికగా వ్యవహరించండి 


Also Read: జనవరి 23 నుంచి ఫిబ్రవరి 09 వరకూ మీ రాశిపై బుధుడి ప్రభావం.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం!


మకర రాశి


ఈ రోజు మీరు మీ పనిని సులభంగా పూర్తి చేస్తారు. సమయం ఉన్నప్పుడు మీ తప్పుల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో వచ్చే సమస్యలు పరిష్కారమవుతాయి. 


కుంభ రాశి 


ఈ రోజు మీరు సామాజిక పనులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. భావోద్వేగాల కోసం డబ్బు ఖర్చు చేయవద్దు. ఇంటికి అతిథులు వస్తారు..మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు గౌరవం లభిస్తుంది. మీరు పెద్ద అధికారులను కలవవచ్చు 


మీన రాశి


ఈ రోజు మీరు మతపరమైన ఆలోచనల ప్రభావానికి లోనవుతారు. యువత తమ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. సాంకేతిక రంగాల విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  


Also Read: శివరాత్రులు ఎన్ని .. భోళా శంకరుడికి మహా శివరాత్రి ఎందుకు మరింత ప్రత్యేకం - శివయ్యకు ఏ అలంకారం ఇష్టం!