Horoscope Today 08th november 2023 (దిన ఫలాలు నవంబర్ 08, 2023)


మేష రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. కార్యాలయంలో అందరితో మంచి ప్రవర్తనను కొనసాగించండి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కొంతమంది మీకు హాని కలిగించే ప్రయత్నం చేస్తారు. అప్రమత్తంగా వ్యవహరించాలి.


వృషభ రాశి
మీ పనిని ఇతరులకు అప్పగించకండి. రాజకీయ వ్యక్తులకు ప్రత్యర్థుల వల్ల సమస్యలు ఎదురుకావచ్చు. మార్కెటింగ్  రంగంలో ఉండేవారికి శుభసమయం. సహోద్యోగుల నుంచి మీకు గౌరవం లభిస్తుంది. విద్యార్థులు చదువులో కొన్ని ఆటంకాలను ఎదుర్కోవలసి ఉంటుంది.


మిథున రాశి
మీరు భౌతిక వనరులను కూడగట్టుకోవడం గురించి ఆలోచిస్తారు. సీనియర్లు మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మి కార్యకలాపాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు స్నేహితులతో కలసి వ్యాపారం ప్రారంభించవచ్చు. అనుకోని ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. 


Also Read: కార్తీకమాసం వచ్చేస్తోంది - నెలంతా తలకు స్నానం చేయకపోతే ఏమవుతుంది!


కర్కాటక రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితంలో ఒత్తిడి దూరమవుతుంది. ఆదాయ వనరులు కొద్దిగా బలహీనంగా ఉంటాయి. ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. కళారంగంతో అనుబంధం ఉన్నవారికి ఈరోజు చాలా మంచి రోజు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.


సింహ రాశి
వ్యాపార లావాదేవీలను జాగ్రత్తగా చేయండి. ప్రశాంతంగా ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని సాధించాలనే తపన ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. డబ్బు సంబంధిత విషయాలకు సంబంధించి మీ ఉద్దేశాలను స్పష్టంగా ఉంచండి. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.


కన్యా రాశి
ఎక్కువ డబ్బు ఖర్చుచేయవద్దు. అనుకున్న పనుల్లో జాప్యం జరగవచ్చు. తప్పుడు వ్యక్తులతో స్నేహం చేయవద్దు. మీ మనసులో మాటని సూటిగా చెప్పేందుకు సంకోచించవద్దు. మీ ప్రవర్తనను నియంత్రణలో ఉంచుకోవాలి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు కొంతకాలం వాయిదా వేయడమే మంచిది.


Also Read: శనిదోషం తొలగిపోవాలంటే దీపావళికి నువ్వులతో దీపం ఇలా వెలిగించండి!


తులా రాశి
ఈ రోజు మీరు కుటుంబంతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి కొనుగోలు, అమ్మకం నుంచి ప్రయోజనం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారంలో మీ కార్యాచరణ పెరుగుతుంది. 


వృశ్చిక రాశి
పెండింగ్ పనిని పూర్తి చేయడంపై ఏకాగ్రత వహించండి. కొత్త వ్యాపారాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారి ఆదాయం పెరుగుతుంది. మీరు మీ పరిచయాల ద్వారా ప్రయోజనాన్ని పొందుతారు. ఆర్థిక విషయాలలో ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు.


ధనుస్సు రాశి
ఒత్తిడి మీ పనిపై ఆధిపత్యం చెలాయిస్తుంది. వైవాహిక చర్చలకు తొందరపడటం మానుకోండి. ప్రణాళిక ప్రకారం పనులు చేసుకుంటేనే పూర్తవుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో కొంత అసమతుల్యత ఉండవచ్చు. మీరు రహస్య శాస్త్రాలు మరియు పరిశోధనలలో  మంచి ఫలితాలు సాధిస్తారు.


మకర రాశి
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉండొచ్చు. మారుతున్న వాతావరణం కారణంగా అనారోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మాట్లాడేటప్పుడు కఠిన పదాలు వినియోగించవద్దు. వైవాహిక బంధంలో అనవసర వాగ్వాదానికి చోటివ్వకండి


Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!


కుంభ రాశి
ఈ రోజు మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అవసరమైన సమయంలో మీ సన్నిహితుల నుంచి సహకారం అందుతుంది. మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు అప్పులు చేసే అవకాశం ఉంది.  గృహ సౌఖ్యాల పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగుల పని సామర్థ్యం పెరుగుతుంది. వైవాహిక సంబంధాలలో ఉన్న వివాదాలు సమసిపోతాయి.


మీన రాశి
పనుల్లో నాణ్యత పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు గౌరవం పొందుతారు. ప్రేమ వివాహానికి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ఈరోజు మంచిది. కుటుంబంలో శుభకార్యాలకు ధనాన్ని వెచ్చిస్తారు. శత్రువుల వల్ల సమస్యలు వస్తాయి.