జనవరి 17 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. మీ నుంచి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధగా ఉండాలి.  కుటుంబానికి సమయం కేటాయిస్తారు. కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఆందోళన తొలగిపోతుంది. ఇది మీ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది 


వృషభ రాశి


ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల సహాయం పొందుతారు. ఈరోజు అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. సోదరులు,  సోదరీమణులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మనోబలం పెరుగుతుంది.  విద్యార్థులు తమ చదువులపై ఏకాగ్రత వహిస్తారు 


మిథున రాశి


ఈ రోజంతా మీరు ఆనందంగా ఉంటారు. ఆన్‌లైన్ చెల్లింపు సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. అధిక కోపం, అధిక ఉత్సాహాన్ని తగ్గించుకోవడం మంచిది.  జీవితం పట్ల సానుకూలత పెరుగుతుంది. అజీర్ణం సంబంధిత సమస్యలుంటాయి


Also Read: కుంభమేళాలో స్నానఘాట్ కి వెళ్లొచ్చేందుకు ఎంత సమయం పడుతోందో తెలుసా.. మొదటి 4 రోజుల్లో ఎన్ని విశేషాలో!
 
కర్కాటక రాశి


ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. కుటుంబంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయనే భయం ఉంటుంది. పనికిరాని వాదనలకు దూరంగా ఉండండి. మీ తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతాయి జాగ్రత్త.


సింహ రాశి


ఈ రోజు మీ దృష్టి పని పూర్తి చేయడంపై ఉంటుంది. రిటైల్ వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీపై ఒత్తిడి పెరుగుతుంది.  అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.  


కన్యా రాశి 


ఈ రోజు వివాహానికి సంబంధించిన చర్చలు ముందుకు సాగవచ్చు. మీ పిల్లల విజయానికి మీరు గర్వపడతారు. డబ్బు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. రక్తపోటు సమస్య వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు రుణం తీసుకోవలసి రావచ్చు.


Also Read: సూర్యుడి రాశి పరివర్తనం ఫిబ్రవరి 12 వరకు ఈ 4 రాశులవారి జీవితంలో అన్నీ అద్భుతాలే!


తులా రాశి


ఈరోజు నిలిచిపోయిన ప్రాజెక్టులు చాలా వేగంగా సాగుతాయి. బోధనతో సంబంధం ఉన్న వ్యక్తుల కీర్తి పెరుగుతుంది. నూతన  వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రేరణ పొందుతారు. కుటుంబంలతో సంతోష సమయం గడుపుతారు.  


వృశ్చిక రాశి


ఈ రోజు కొన్ని సమస్యలు ఉంటాయి.  వెన్నునొప్పికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.  మీ ఆలోచనలను ఇతరులపై రుద్దడం మానుకోండి. 


ధనుస్సు రాశి


ఈ రోజు మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. పాత విషయాల గురించి ఆలోచిస్తారు. మీరు సాహసోపేతమైన  పెట్టుబడులపై ఆసక్తి కలిగి ఉంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి తగాదాలు పెరిగే అవకాశం ఉంది. యువత తమ వృత్తిలో ప్రయోగాలు చేయవచ్చు 


మకర రాశి


ఈ రోజు అనవసరమైన పనుల్లో సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గృహ నిర్మాణ పనుల్లో వచ్చిన ఆటంకాలు తొలగిపోతాయి. ఉపయోగకరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. మీరు మీ అభిరుచికి అనుగుణంగా పని చేయాలి అనుకుంటారు


Also Read: కరవు, యుద్ధం, పకృతి వైపరీత్యాలు, అంటు వ్యాధులు..2025లో జరగబోయే ఈ సంఘటనలు ప్రపంచాన్ని వణికిస్తాయ్!


కుంభ రాశి


ఈ రోజు మీ పనుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు. లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించండి. పనితీరుని మార్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. 


మీన రాశి 


ఈ రోజు మీనరాశికి సంబంధించిన వారి వైవాహిక సంబంధాలలో వివాదాలు ఉంటాయి. రక్తపోటు రోగులు   ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల మీకు చాలా నష్టం వాటిల్లుతుంది. మనసులో కొన్ని సందేహాలు తలెత్తుతూనే ఉంటాయి.


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.