Astrology: సూర్య భగవానుడు రాశి మారడాన్ని సంక్రమణం అంటారు. 12 నెలల పాటూ 12 రాశులలో సంచరిస్తాడు. ప్రస్తుతం మకరంలో ఉన్న సూర్యుడు... ఫిబ్రవరి 12 న కుంభంలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు రాశి పరివర్తనం చెందిన ప్రతిసారీ ఆ ప్రభావం 12 రాశులవారిపైనా ఉంటుంది. కొన్ని రాశులవారికి అదృష్టం ..మరికొన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలుంటాయి. మకర రాశిలో సూర్య సంచారం ఈ నాలుగు రాశులవారికి అదృష్టానిస్తోంది. ఈ సమయంలో ఉద్యోగం, వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం. కొన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు.
సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
మకరరాశిలో సూర్యుడు సంచరించడం వల్ల సింహరాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. గత కొంతకాలంగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కోరుకున్న ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మార్కెట్లో తమ ప్రభావాన్ని పెంచుకునే అవకాశాలుంటాయి. ఉద్యోగస్తులు పై అధికారులతో సత్సంబంధాలు మెంటైన్ చేయాలి. వైవాహిక జీవితంలో ఉండే ఇబ్బందులు సమసిపోతాయి. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది.
Also Read: కరవు, యుద్ధం, పకృతి వైపరీత్యాలు, అంటు వ్యాధులు..2025లో జరగబోయే ఈ సంఘటనలు ప్రపంచాన్ని వణికిస్తాయ్!
తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఈ వారం తులారాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ ఉద్యోగ పనుల నిమిత్తం ప్రయాణం చేయవలసి రావచ్చు. ప్రయాణంలో మీకు శుభవార్తలు అందుతాయి. వారం చివరి భాగంలో, పెట్టుబడి నుండి ఆశించిన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు ఇప్పుడు పరిష్కార మార్గంలో ఉంది. గృహ సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వృశ్చిక రాశి (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
వృశ్చిక రాశి వారికి కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, మీరు మీ పని రంగంలో మంచి విజయాన్ని పొందుతారు. ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనాలను పొందుతారు. అవివాహితులకు మంచి సంబంధం రావచ్చు. పూర్తి ఆత్మవిశ్వాసం వల్ల మనసు సంతోషంగా ఉంటుంది. విలాస వస్తువుల కొనుగోలులో ఖర్చు ఉంటుంది.
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
మీన రాశి (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
మీనరాశి వారికి ఈ వారం శుభప్రదంగా , ప్రయోజనకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో, మీరు మీ కెరీర్‌లో ముందుకు సాగడానికి గొప్ప అవకాశాన్ని పొందవచ్చు. ఈ సమయం విద్యార్థులకు అనుకూలమైనది, పరీక్షలు మరియు పోటీలకు సిద్ధమవుతున్న వ్యక్తులు వారం మధ్యలో శుభవార్తలను అందుకుంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: కుంభమేళాకి నాగ సాధువులు, అఘోరాలు ఎందుకొస్తారు - ఆధ్యాత్మిక ఉత్సవాల్లో అఖాడాల పాత్ర ఏంటి!