2025లో రాశులు మారుతున్న కీలక గ్రహాలు ఇవే


ఈ సంవత్సరం అంటే 2025 లో కుజుడు గ్రహాలకు రాజుగా ఉంటాడు..ఏప్రిల్ నుంచి గ్రహాల రాజుగా సూర్యుడు ఉంటాడు.  


ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్న శని..మార్చి నెలాఖరున కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు


ఇదే ఏడాది బృహస్పతి తన రాశిని మార్చుకుంటాడు. ప్రస్తుతం వృషభంలో ఉన్న బృహస్పతి మిథునంలోకి పరివర్తనం చెందుతాడు


2025లో రాహువు, కేతువు కూడా తమ స్థానాలు మార్చుకుంటాయి.  కేతువు సింహం నుంచి ...రాహువు మీనం నుంచి రాశి మారుతాయి


ఇలా ప్రధాన గ్రహాల మార్పుల కారణంగా 2025లో చాలా సంఘటనలు జరుగుతాయి  


Also Read: కుంభమేళాకి నాగ సాధువులు, అఘోరాలు ఎందుకొస్తారు - ఆధ్యాత్మిక ఉత్సవాల్లో అఖాడాల పాత్ర ఏంటి!


శని రాశి మార్పు


మీనరాశిలోకి శనిగ్రహ సంచారం మార్చి 29, 2025న ప్రారంభమవుతుంది. మార్చి 29, 2025న శనిగ్రహం కుంభరాశి నుంచి వెళ్లి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రపంచంలో కల్లోలం ఏర్పడవచ్చు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ తర్వాత మారుతున్న ప్రపంచంలో ఇప్పుడు యుద్ధాలు కొత్త కోణాల్లో ప్రారంభమవుతాయి. మీనరాశిలో రాహువు - శని గ్రహాల కలయిక ప్రభావం కారణంగా మార్చి నుంచి మే మధ్యలో కరువు, యుద్ధం, పేలుడు, అంటువ్యాధులు.. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉంది..ఈ ప్రభావం చాలా జనాభాపై పడుతుంది


Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!


సూర్య గ్రహణాలు


2025 లో రెండు సూర్య గ్రహణాలు సంభవించే అవకాశం ఉంది. ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం 2025 మార్చి 29న సంభవిస్తుంది. ఈ గ్రహణం ఐరోపా, ఆసియాలోని ఉత్తర ప్రాంతాలు, ఆఫ్రికాలోని ఉత్తర మరియు పశ్చిమ ప్రాంతాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఉత్తర ప్రాంతాలు, అట్లాంటిక్ , ఆర్కిటిక్ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ సంపూర్ణ గ్రహణం మధ్యాహ్నం 14.21 నుంచి 18.14 గంటల వరకు ఉంటుంది. అయితే, ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. సూతకాలం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.


2025 లో రెండో సూర్యగ్రహణం 21 సెప్టెంబర్ 2025న సంభవిస్తుంది. ఈ గ్రహణం కృష్ణ పక్ష అమావాస్య నాడు మధ్యాహ్నం 22.59 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 03.23 గంటల వరకు ప్రభావం చూపుతుంది. ఈ సూర్యగ్రహణం కూడా మనదేశంలో  కనిపించదు.  


Also Read: ఉత్తరాయణం ఎప్పటి నుంచి ప్రారంభం.. మకర సంక్రాంతి ఎందుకు పెద్ద పండుగ!


చంద్ర గ్రహణాలు


2025లో రెండు చంద్ర గ్రహణాలున్నాయి. 2025 మార్చి 14 ఫాల్గుణ మాసం శుక్ల పూర్ణిమ రోజు ఏడాదిలో మొదటి  చంద్ర గ్రహణం ఉంటుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10.41 గంటల నుంచి సాయంత్రం 14.18 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. అంటే భారతదేశంలో ఈ గ్రహణం కనిపించనందున సూతకాలం పాటించాల్సిన అవసరం లేదు.


2025 లో రెండో చంద్రగ్రహణం 7 సెప్టెంబర్ భాద్రపద మాసం శుక్ల పూర్ణిమ రోజు సంభవిస్తుంది. ఇది మధ్యాహ్నం 21.57 గంటలకు ప్రారంభమవుతుంది ఉదయం 1.26 గంటల వరకు అమలులో ఉంటుంది మరియు భారతదేశంతో సహా మొత్తం ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, న్యూజిలాండ్, పశ్చిమ మరియు ఉత్తర అమెరికా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది. అందుకే దీనికి సూతకాలం ఉంటుంది. గ్రహణ నియమాలు పాటించాలి.