Naga Sadhus in Kumbh Mela 2025: ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహాకుంభమేళాకి (maha kumbha mela 2025) అఖాడాల సందడి మొదలైంది. వీరి ప్రవేశంతో మహాకుంభమేళా వేడుకలో మరింత భక్తిపూర్వకంగా మారింది.
ఆచార్య మహామండలేశ్వర స్వామి విశ్వాత్మానంద సరస్వతి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన యాత్ర గజాననుడి సవారీతో ప్రయాణం ప్రారంభించారు. మొదట గజాననుడి సవారీ తర్వాత ఇతర దేవతల సవారీలు కూడా యాత్రలో చూడొచ్చు. అఖాడా (Akhada) లను చూసేందుకు భక్తులు భారీగా తరలిచ్చారు. 20 మందికి పైగా మహా మండలేశ్వరులు, రెండు వందల మందికి పైగా నాగ సన్యాసులు యాత్రలో పాల్గొన్నారు. యాత్ర చేస్తూ మహాకుంభమేళాకి తరలివెళుతున్న అఘోరాల ఆశీర్వాదం కోసం భక్తులు పోటీ పడ్డారు.
యాత్రలో పూలతో అలంకరించిన ఈటెలు ఉన్నాయి...వీటిలో "సూర్య ప్రకాష్" అనే ప్రత్యేక బల్లెం ఉంటుంది..ఇది కేవలం ప్రయాగ్‌రాజ్ మహాకుంభ సమయంలో మాత్రమే అఖాడాలు ఆశ్రమం నుంచి బయటకు తీసుకొస్తారు.
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
2025 జనవరి 13 భోగి నుంచి ఫిబ్రవరి ఆఖరివారం శివరాత్రి (Maha Shivaratri in 2025) వరకూ ప్రయాగరాజ్ లో జరిగే మహాకుంభమేళాకి దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కుంభమేళాలో సాధువులు, సన్యాసులు, అఘోరాలు, నాగ సాధువులు దర్శనమిస్తారు. వీరంతా ఆధ్యాత్మిక జీవితాన్ని సంపూర్ణం చేసుకునేందుకు భౌతిక ఆనందాలను విడిచిపెట్టి మోక్షాన్ని అన్వేషిస్తూ ఆఖరి శ్వాస వరకూ ఉండిపోతారు. మనదేశంలో ఇలాంటి వారు దాదాపు 50 లక్షల మంది వరకూ ఉన్నారని అంచనా. కుంభమేళా లాంటి అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల సమయంలో వీరు ఎక్కువగా కనిపిస్తారు.
కుంభమేళాలో నాగ సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వీరి జీవన శైలి మిగిలిన ప్రజల కన్నా పూర్తి భిన్నంగా ఉంటుంది. సనాతన ధర్మాన్ని (Sanatana Dharma)
రక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. దుస్తులు, బంధాలను త్యజించి మనసుతో శరీరాన్ని శాసిస్తారు. నిరంతరం ధ్యానంలో ఉంటారు. బ్రహ్మచర్యం పాటిస్తారు. జనావాసాలకు దూరంగా ఉంటారు. అందుకే కుంభమేళా లాంటి ప్రత్యేక సమాయాల్లో గుంపులుగా తరలివచ్చే వీరిని చూసేందుకు భక్తులు పోటీపడతారు. నాగసాధువులు తమ ప్రతిజ్ఞలో భాగంగా కనీసం 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాలను సందర్శించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో సూర్యోదయానికి ముందే నదిలో స్నానమాచరిస్తారు.
Also Read: ఉత్తరాయణం ఎప్పటి నుంచి ప్రారంభం.. మకర సంక్రాంతి ఎందుకు పెద్ద పండుగ!
స్వాతంత్ర్యానికి ముందు వరకూ అఖాడాలు, నాగ సాధువుల ఆధ్వర్యంలోనే మహా కుంభమేళా జరిగేది..కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వా ఆధ్వర్యంలో మహాకుంభమేళా లాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి సాధువుల పాత్ర పరిమితం అయింది. కుంభమేళా లాంటి ఆధ్యాత్మిక ఉత్సవాల్లో సాధువులు భారీగా పాల్గొనేలా చేయడంలో అఖాడాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. సాధు సంస్థలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు, సనాతన జీవన విధానాన్ని రక్షించేందుకు ఆదిశంకరాచార్యులు ఎనిమిదో శతాబ్ధంలో అఖాడాలను స్థాపించారు. ఇప్పుడు కుంభమేళాలో ఎక్కువమంది సాధువులు పాల్గొనేలా చేయడంలోనూ అఖాడాలదే కీలకపాత్ర.
Also Read: కోటి పుణ్యాలకు సాటి వైకుంఠ ఏకాదశి - 2025లో ఎప్పుడొచ్చిందంటే!