Karun Nair Superb Show: మళ్లీ విజృంభించిన కరుణ్ నాయర్.. స్టన్నింగ్ ఫిప్టీతో జోరు.. ఫైనల్లో విదర్భ

ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఫైనల్ జట్లు ఖరారయ్యాయి. శనివారం జరిగే ఫైనల్లో కర్ణాటకతో విదర్భ అమీతుమీ తేల్చుకోనుంది. కరుణ్ నాయర్ మరోసారి మెరిశాడు. 

Continues below advertisement

Vijay Hazary Trophy News: విజయ్ హజారే వన్డే ట్రోఫీ ఫైనల్లోకి విదర్భ ప్రవేశించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో మహారాష్ట్రపై 69 పరుగులతో గెలుపొందింది. గురువారం రాజకోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన విదర్భ 50 ఓవర్లలో 3 వికెట్లకు 380 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ మరో స్టన్నింగ్ ఫిఫ్టీ (44 బంతుల్లో 88 నాటౌట్, 9 ఫోర్లు, 5 సిక్సర్లు)తో సత్తా చాటాడు. ఈ టోర్నీలో జోరుమీదున్న కరుణ్.. త్రుటిలో మరో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇప్పటికే తను ఐదు సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఇక ఓపెనర్లు ధ్రువ్ షోరే (120 బంతుల్లో 114, 14 ఫోర్లు, 1 సిక్సర్), యశ్ రాథోడ్ (101 బంతుల్లో 116, 14 ఫోర్లు, 1 సిక్సర్)తో సత్తా చాటారు. వికెట్ కీపర బ్యాటర్ జితేశ్ శర్మ (33 బంతుల్లో 51, 3 ఫోర్లు, 3 సిక్సర్లు)తో దూకుడైన ఫిఫ్టీ ని నమోదు చేశాడు. దీంతో ఈ ట్రోఫీ చరిత్రలో తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది. బౌలర్లలో ముఖేశ్ చౌదరీకి రెండు వికెట్లు దక్కాయి.  అనంతరం ఛేధనలో ఓవర్లన్నీ ఆడిన మహారాష్ట్ర ఏడు వికెట్లకు 311 పరుగులు చేసి, ఓడిపోయింది. అర్షన్ కులకర్ణి (90), అంకిత్ బావ్నే (50) ఫిఫ్టీలతో రాణించగా, చివర్లో నిఖిలో నాయక్ (49) ఒంటరి పోరాటం చేశాడు. బౌలర్లలో దర్శన్ నల్కండే, నచితేక్ భూటేకు మూడేసి వికెట్లు దక్కాయి. 

Continues below advertisement

224 పరుగుల భాగస్వామ్యం..
టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్ కు ఆహ్వనించడం ఎంత తప్పో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు త్వరగానే తెలిసివచ్చింది. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఓపెనర్లు ధ్రువ్, యశ్ తర్వాత చెలరేగి పోయారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ, మెరుగ్గా స్ట్రైక్ రొటేట్ చేశారు. ఈక్రమంలో 224 పరుగుల భారీ పార్ట్నర్ షిప్ ను నమోదు చేశారు. ఈక్రమంలో సెంచరీ చేసుకున్న తర్వాత తొలుత యశ్ ఔటయ్యాడు. కాసేపటికే ధ్రువ్ కూడా పెవిలియన్ కు చేరాడు. అయితే అద్భుతమైన ఫామ్ లో ఉన్న కరుణ్ మాత్రం.. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడాడు. కేవలం 35 బంతుల్లోనే ఫిఫ్టీ చేసుకున్నాడు. ఆ తర్వాత జితేశ్ కూడా రెచ్చిపోవడంతో విదర్భ భారీ స్కోరు సాధించింది. రావడంతోనే టీ20 తరహాలో రెచ్చిపోయిన జితేశ్..30 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. 

రుతురాజ్ విఫలం..
భారీ టార్గెట్ ఛేదించేక్రమంలో మహారాష్ట్రకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. కెప్టెన్ కమ్ ఓపెనర్ రుతురాజ్ (7) త్వరగానే ఔటయ్యాడు. అయితే మరో ఓపెనర్ అర్షిన్ ఓపికగా ఆడాడు. మిగతా బ్యాటర్లలో కాస్త కాస్త భాగస్వామ్యాలు నమోదు చేసుకుంటూ, ఫిఫ్టీ పూర్తి చేసుకుని సెంచరీ దిశగా వెళుతున్నప్పుడు ఔటయ్యాడు. చివర్లో అంకిత్, నిఖిల్ పోరాడినా అప్పటికే విదర్భ పరాజయం ఖరారైంది. బౌలర్లు కూడా వరుస విరామాల్లో వికెట్లు తీయడంలో టార్గెట్ కు చాలా దూరంలోనే విదర్భ ఆగిపోయింది. ఇక ఫైనల్లో కర్ణాటకతో ఇదే వేదికపై శనివారం విదర్భ తలపడనుంది.  

Also Read: BCCI Vs Gambhir: గంభీర్ కోచింగ్ స్టాఫ్‌పై బీసీసీఐ నజర్..! డేంజర్లో వారిద్దరూ.. త్వరలో బ్యాటింగ్ కోచ్ నియమించనున్న బోర్డు!!

Continues below advertisement