Guru Gochar 2025: జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి చాలా ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. గురు గ్రహం ప్రతికూల పరిస్థితులలో మాత్రమే అశుభ ఫలితాలను ఇస్తాడు కానీ  చాలా సందర్భాలలో శుభ ఫలితాలను అందిస్తాడు. గురుడు జ్ఞానానికి, ఉన్నతికి సంబంధించిన గ్రహం.  2025 మే నుంచి గురుడు రాశి పరివర్తనం చెందుతాడు.  మే రెండోవారంలో మిథున రాశిలోకి ప్రవేశించే గురుడు అక్టోబరులో కర్కాటక రాశిలో అడుగుపెడతాడు. తిరిగి డిసెంబర్లో మిథునంలోకి వచ్చేస్తాడు. ఈ ఏడాది బృహస్పతి సంచారం మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోండి 


మేష రాశి


ఈ ఏడాది బృహస్పతి రాశి మార్పు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇప్పటివరకూ మీరు  ఇప్పుడు మీరు చేయలేని పనిలో విజయం సాధిస్తారు. బృహస్పతి రాశి మార్పు ఉద్యోగ, వ్యాపారులకు మేలు చేస్తుంది. 


వృషభ రాశి


వృషభ రాశి వారికి 2025లో బృహస్పతి సంచారం మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితులు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక లాభాలకు అవకాశాలు పెరుగుతాయి. అవివాహితులు వివాహం చేసుకోవచ్చు. 


Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!


మిథున రాశి


బృహస్పతి మీ రాశిలో సంచరిస్తాడు. మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ సమయంలో శత్రువులపై చేయి సాధిస్తారు. సౌకర్యాలు పెరుగుతాయి. బృహస్పతి సంచారం మీ గౌరవం పెంచుతుంది.


కర్కాటక రాశి


బృహస్పతి రాశి మార్పు మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. డబ్బు సంపాదించడానికి అదనపు కష్టపడవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు తమ పనికి సంబంధించి కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది - 


సింహ రాశి


గురుడి రాశి పరివర్తనం మీకు మంచి చేస్తుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఇల్లు , వాహనం  ఆనందాన్ని పొందుతారు. మీరు రుణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


Also Read: రథసప్తమి ఎప్పుడు..ఆదిత్యుడి ఆరాధన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారు!


కన్యా రాశి 


బృహస్పతి సంచారం వల్ల ఈ రాశి వారికి లాభ అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. రుణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు , ఆర్థిక పురోగతి ఉంటుంది.


తులా రాశి


డబ్బు సంబంధిత విషయాలలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. లాభావకాశాలు పెరుగుతాయి. గౌరవం పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. లాభపడే అవకాశాలు వస్తాయి


వృశ్చిక రాశి


బృహస్పతి రాశి మార్పు మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో, మీరు పెట్టుబడి సంబంధిత విషయాలలో నిర్ణయాలు తీసుకోవడం సులభం.


ధనుస్సు రాశి


ఈ రాశివారికి బృహస్పతి శుభ ఫలితాలను ఇస్తాడు. లాభాల కోసం అవకాశాలు పెరుగుతాయి. మీరున్న రంగంలో విజయం సాధిస్తారు. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. పెద్ద ఒప్పందం కుదుర్చుకుంటారు. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు.


మకర రాశి


గురుడి సంచారం మీ ఆనందాన్ని పెంచుతుంది. ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు. పెట్టుబడులు కలిసొస్తాయి. కానీ అనవసర ఖర్చులు పెరుగుతాయి. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. విలాసాలు పెరుగుతాయి.


కుంభ రాశి


బృహస్పతి సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక మూలాలు పెరుగుతాయి. అదృష్టం కలిసొస్తుంది. డబ్బు సంబంధిత ప్రయోజనాలను పొందే సంకేతాలు ఉన్నాయి. కొన్ని పనులు ఆగిపోవచ్చు.


Also Read: మౌని అమావాస్య, శివరాత్రికి భారీ రద్దీలో కుంభమేళాకి పరిగెత్తకండి.. ఇంట్లోనే ఇలా చేయండి చాలు!


మీన రాశి


మిథున రాశిలో బృహస్పతి ప్రవేశం మీకు అంత మంచి ఫలితాలు ఇవ్వదు. చేపట్టిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయ్. ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.  


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.