Falgun Purnima 2024:  ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజే హోలికా దహన్, హోలీ నిర్వహిస్తారు. ఈ ఏడాది పౌర్ణమి తగులు మిగులు వచ్చింది...మార్చి 24 ఆదివారం ఉదయం 9 గంటల 30 నిముషాల వరకూ చతుర్థశి ఉంది ఆ తర్వాత పౌర్ణమి ఘడియలు మొదలై..మార్చి 25 సోమవారం ఉదయం 11 గంటల 30 నిముషాల వరకు ఉన్నాయి. అందుకే ఆదివారం రాత్రి హోలికా దహన్ నిర్వహించి సోమవారం ఉదయం రంగులు చల్లుకుంటారు. ఇదే రోజు హోలీతో పాటూ చంద్రగ్రహణం కూడా ఉంది కానీ మన దేశంలో గ్రహణం కనిపించనందున సూతకాలం పాటించాల్సిన అవసరం లేదు. ఫాల్గుణ పౌర్ణమి రోజు చాలా శుభయోగాలున్నాయి..ఫాల్గుణ పౌర్ణమి నాటికి సూర్యుడు, శుక్రుడు మీన రాశిలో సంచరిస్తున్నారు, బుధుడు - గురుడు మేషంలో ఉన్నారు. ఈ సమయంలో గ్రహ సంచారం కొన్ని రాశులవారికి అదృష్టం, ఐశ్వర్యాన్నిస్తోంది...ఆ రాశుల్లో మీరున్నారా...


Also Read: హోలీ రోజు ఎవరు ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలో తెలుసా!


మేష రాశి


ఫాల్గుణ పూర్ణిమ రోజు మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారిపై  లక్ష్మీ దేవి  ప్రత్యేక ఆశీర్వాదం ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. ఏ రంగంలో ఉన్నవారైనా మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు.. సంపద వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో అపారమైన  లాభాలుంటాయి. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధికమించి పొదులు చేయడంలో సక్సెస్ అవుతారు.


Also Read: శవాల బూడిదతో హోలీ సంబరాలు - ఇక్కడ వారం ముందు నుంచే సందడి మొదలు!


కన్యా రాశి


ఫాల్గుణ పూర్ణిమ రోజు కూడా కన్యా రాశి వారికి శుభ ఫలితాలున్నాయి. చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు ఈ రాశిలోనే ఉంటాడు. అందుకే ఈ రాశివారి జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబంలో వివాదాలు సమసిపోతాయి. శుభవార్తలు వింటారు. పాత స్నేహితులను కలుస్తారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. 


Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ రాశివారికి యోగకాలం - ఆ ఒక్క విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవ్!


ధనుస్సు రాశి


ధనుస్సు రాశి వారికి కూడా ఫాల్గుణ పూర్ణిమ కలిసొస్తుంది. చాలా రోజులుగా వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ కష్టానికి తగిన ఫలాలను పొందవచ్చు. కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు , ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. జీవితంలో సానుకూల ఫలితాలు మొదలవుతాయి. అప్పుల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.  


మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!


Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.