Holi Celebrations 2024: ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు రంగులపండుగ జరుపుకుంటారు. చిన్నా పెద్దా అందరూ ఈ వేడుకలో పాల్గొని రంగులు చల్లుకోవడం ద్వారా అదృష్టం కలిసొస్తుందని నమ్ముతారు. అయితే హోలీ రోజు వేసుకునే డ్రెస్ మొత్తం రకరకాల రంగులతో నిండిపోయినా కానీ మీ రాశి ఆధారంగా డ్రెస్ వేసుకోవడం మీకు మరింత అదృష్టాన్నిస్తుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరి మీ రాశిప్రకారం ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలో తెలుసా..
మేష రాశి
ఈ రాశివారు చాలా శక్తివంతంగా ఉంటారు. దైర్యం ఎక్కువే. అందుకే మేష రాశివారు రెడ్, ఆరెంజ్, ఎల్లో రంగుల దుస్తులు ధరించడం మీకు అనుకూలం.
వృషభ రాశి
ఈ రాశివారు హోలీ పండుగ రోజు పింక్, బ్లూ కలర్స్ డ్రెస్ వేసుకోవాలి. మీ రాశి ప్రకారం ఈ రంగుల డ్రెస్ వేసుకుంటే ఆనందం పెరుగుతుంది.
Also Read: శవాల బూడిదతో హోలీ సంబరాలు - ఇక్కడ వారం ముందు నుంచే సందడి మొదలు!
మిథున రాశి
మిథున రాశి వారు మల్టీ టాలెంటెడ్. బహుముఖ ప్రజ్ఞ వీరిసొంతం. అందుకే ఈ రాశివారు హోలీ రోజు ఎల్లో, ఆరెంజ్ డ్రెస్ వేసుకుంటే అనుకూల ఫలితాలుంటాయి.
కర్కాటక రాశి
ఈ రాశివారిది చాలా సున్నితమైన మనస్తత్వం. హోలీ రోజు ఈ రాశివారు బ్లూ, పింక్ కలర్ డ్రెస్ వేసుకోవడం ఉత్తమం. వీరి ప్రేమ స్వభావానికి ఈ రంగులు సరిగ్గా సరిపోతాయి..
సింహ రాశి
సింహ రాశి వారు రంగుల పండుగ రోజు రెడ్, ఆరెంజ్, గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకుంటే అనుకూల ఫలితాలు పొందుతారు. గంభీరమైన వ్యక్తిత్వానికి ఈ రంగులు సూచన.
కన్యా రాశి
కన్యా రాశి వారు హోలీ రోజు గ్రీన్, బిస్కెట్ కలర్ డ్రెస్ వేసుకోవడం మంచిది. ఆచరణాత్మకమైన వీరి స్వభావానికి ఈ రంగులు అతికినట్టు సరిపోతాయి.
Also Read: హోళీ రోజు రంగులెందుకు చల్లుకుంటారు, కొత్తగా పెళ్లైనవారికి ఈ విషయం తెలుసా!
తులా రాశి
తులా రాశివారు కూల్ గా కనిపిస్తారు కానీ వ్యవహారాలు బాగానే చక్కబెట్టేస్తారు. మంచి దౌత్యవేత్తలు. ఈ రాశివారు పింక్, బ్లూ కలర్స్ వేసుకుంటే అనుకూల ఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి
వృశ్చికం రాశి నీటికి సంబంధించిన రాశి. అందుకే హోలీ రోజు ఈ రాశివారు బ్లాక్, మరూన్, యాష్ కలర్ డ్రెస్ వేసుకోవడం ఉత్తమం. ఈ రాశివారి లోతైన భావాలను ఈ రంగులు ప్రతిబింబిస్తాయి
ధనుస్సు రాశి
ఈ రాశివారు ఆశావాదులు.స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటారు. అందుకే హోలీ రోజు ధనస్సు రాశివారు వైట్ కలర్ డ్రెస్ వేసుకోవడం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ మీ వ్యక్తిత్వానికి సూచన.
మకర రాశి
ఈ రాశివారు కష్ట జీవులు. బాధ్యతలు తీసుకోవడంలోనూ ముందుటారు. మకర రాశి వారి మనస్తత్వం ప్రకారం హోలీ రోజు గ్రే, బ్లూ కలర్ డ్రెస్ వేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా హోలీ రోజు ఈ రెండు రంగులు మీకు చాలా అనుకూలం.
Also Read: మొదటి 2 నెలలు మినహా క్రోధినామ సంవత్సరం ఈ రాశివారికి తిరుగులేదంతే!
కుంభ రాశి
ఈ రాశివారికి సృజనాత్మకత చాలా ఎక్కువ. అందుకే కుంభ రాశివారు హోలీ రోజు సృజనాత్మకతను ప్రతిబింబించేలా గ్రే కలర్ వేసుకుంటే అదృష్టం కలిసొస్తుంది
మీన రాశి
మీన రాశివారిది ఊహాత్మక, కళాత్మక స్వభావం . ఎదుటివారిపై సానుభూతి ఎక్కువ. అందుకే గ్రీన్, రెడ్ కలర్స్ మీకు హోలీ రోజు సరైనవి.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం