Daily Horoscope for March 18th 2024 Saturday in Telugu 


మేష రాశి


కొత్త అవకాశాలు వస్తాయి..వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితులు గతంలో కన్నా మెరుగుపడతాయి. ఆరోగ్యం  బావుంటుంది. ప్రేమికులు పెళ్లి దిశగా అడుగేసేందుకు ఇదే మంచిసమయం. వృత్తి, ఉద్యోగం, కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం, అదృష్ట సంఖ్య 3 (మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


వృషభ రాశి 


మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు సంబంధించిన మంచి ఫలితాలు ఇప్పుడు పొందుతారు. కొన్ని పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చదివిన తర్వాతే సంతకం పెట్టాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోపం తగ్గించుకోవాలి. ఈ రోజు మీ అదృష్టం రంగు ఉదా, అదృష్ట సంఖ్య 3 ( వృషభ రాశి వార్షిక  ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


మిధున రాశి 


మీ కలలను నిజం చేసుకోవడానికి ఇది మంచి సమయం. మీరు పనిచేసే రంగంలో బలమైన మార్పుు తీసుకొచ్చేందుకు ఇదే మంచి సమయం. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ లో మంచి ఫలితాలను ఇస్తాయి. జీవిత భాగస్వామి నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటుంది. మీ అదృష్ట రంగు బంగారం. మీ అదృష్ట సంఖ్య 8   (మిథున రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


కర్కాటక రాశి


ఈ రోజు కర్కాటక రాశివారి టైమ్ బాలేదు. ఏ పని ప్రారంభించినా అనుకున్న ఫలితాలకు విరుద్ధంగా జరుగుతుంటాయి. మానసికంగా ఇబ్బంది పడతారు కానీ ఆశ కోల్పోరు. మీ పట్టుదలే మిమ్మల్ని విజయం దిశగా నడిపిస్తుంది. ఈ రోజు మీకు కలిసొచ్చే రంగు ఆకుపచ్చ,   అదృష్ట సంఖ్య 9 (కర్కాటక రాశి వార్షిక ఫలితాల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి)


సింహ రాశి


మీపై ఆధిపత్యం చెలాయించే వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. మీ కోసం మీరు నిలబడే ధైర్యం చేయండి. సమస్యలను చూసి వెనక్కు తగ్గొద్దు.  విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం , ఆర్థిక విషయాలు ఈరోజు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. చట్టపరమైన చికాకులు కొన్ని మిమ్మల్ని వెంటాడుతాయి. మీ అదృష్ట రంగు పింక్, అదృష్ట సంఖ్య 4


కన్యా రాశి 


అధికారిక పనుల్లో బిజీగా ఉంటారు, విదేశీ పర్యటన చేయాలి అనుకున్నవారికి ఇదే మంచి సమయం. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు ప్రమోషన్ పొందుతారు. మీరు ఆశ్చర్యపోయే గుడ్ న్యూస్ వింటారు. ఆర్థిక పరిస్థితులు బలపడతాయి. ఆరోగ్యం బావుంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి భయపడొద్దు. మీ అదృష్ట రంగు పగడం,  అదృష్ట సంఖ్య 9. 


తులా రాశి


వృత్తిపరమైన సామర్థ్యంతో సరైన రంగంలో మీ అడుగు పెట్టేలా ప్లాన్ చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి నుంచి గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. మీ జీవితంలో ఆకస్మిక మార్పులు వస్తాయి. ధైర్యంగా ఉండాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక సంబంధిత విషయాల్లో తొందరపడొద్దు. మీ అదృష్ట రంగు మెరూన్. మీ అదృష్ట సంఖ్య 2. 


వృశ్చిక రాశి


తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ లో చిక్కుల్లోకి నెట్టేస్తాయి. చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోకుండా జాగ్రత్త వహించండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బావుంటుంది. ఈ రోజు మీ  అదృష్ట రంగు తెలుపు. మీ అదృష్ట సంఖ్య 5


Also Read: ఈ రాశులవారు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేస్తారు!


ధనుస్సు రాశి


మీ జీవితంలో సరికొత్త ప్రారంభానికి ఆరంభం ఇది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి...నిర్ణయం మీ చేతిలోనే ఉంటుంది. మిమ్మల్ని మీరు నమ్మండి..ఇతరుల మాటలు విని తప్పుదారిలోకి వెళ్లొద్దు.  ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీ అదృష్ట రంగు ఎరుపు, మీ అదృష్ట సంఖ్య 1


మకర రాశి


కుటుంబం , స్నేహితులకు మంచి సమయం కేటాయిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు ఈరోజు పూర్తిచేసుకుంటారు. ఓ గుడ్ న్యూస్ వింటారు. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. అనవసర ఆలోచనకు చెక్ పెట్టడం మంచిది. మీ అదృష్ట రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2


Also Read: వారఫలం ( మార్చి 17 to 23) - ఈ వారంలో మీకు శుభప్రదమైన రోజులివే!


కుంభ రాశి 


మీ సంకల్పం మీ కెరీర్లో ఓ మెట్టు పైకి ఎక్కిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. నూతన ఒప్పందాలు చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బావుంటుంది. ఈ రోజు మీ అదృష్ట రంగు ఎరుపు. మీ అదృష్ట సంఖ్య 7.


మీన రాశి


ఈ రోజు ప్రారంభం బాగానే ఉంటుంది. ఈ రోజు మీ షెడ్యూల్‌లో కొన్ని సవాలుతో కూడిన ఈవెంట్‌లను ప్లాన్ చేస్తారు. ఆర్థికంగా ఎదిగేందుకు ఇదే మంచి సమయం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రోజు మీ అదృష్ట రంగు గోధుమ, మీ అదృష్ట సంఖ్య 9


మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...


Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.