ఏప్రిల్ 21 ఆదివారం రాశిఫలాలు (Horoscope Today 21st April 2024 )

మేష రాశి 

ఈ రాశి ఉద్యోగులు పనితీరు మార్చుకుంచే మీ పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి.అనవసర కోపానికి దూరంగా ఉండాలి. 

వృషభ రాశి

 ఈ రాశివారు కొత్తగా పరిచయం అయిన వ్యక్తులను అతిగా నమ్మేయకండి. వ్యాపారాలపై శ్రద్ధ చూపిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుడి ప్రవర్తన వల్ల బాధపడతారు. 

మిథున రాశి

మిథున రాశి ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచండి. ప్రేమ సంబంధాల్లో సంతోషం ఉంటుంది. ఉన్నతాధికారులతో మాట పట్టింపులు ఉండొచ్చు..

Also Read: ఏప్రిల్ 23 నుంచి జూన్ 01 వరకూ ఈ పారాయణం చేయండి - ఫలితం మీరు ఊహించలేరు!

కర్కాటక రాశి

మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రాశి విద్యార్థులు చదువులో అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు. ప్రతికూల ఆలోచనలు రానివ్వవద్దు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. 

సింహ రాశి

ఈ రోజంతా మీరు చాలా బిజీగా ఉంటారు. కుటుంబ పెద్దల అభిప్రాయాలను గౌరవించండి. ప్రేమ సంబంధాలలో సమస్యలుంటాయి. కోపం తగ్గించుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త

కన్యా రాశి

కన్యా రాశివారికి  ఈ రోజు మీకు మంచిరోజు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచన చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవత భాగస్వామి మద్దతు మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

Also Read: రామాయణంలో సుందరకాండకే ఎందుకంత ప్రాధాన్యం - సుందరకాండలో అసలేముంది!

తులా రాశి

మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. పాత అప్పులు తీర్చాలనే ఒత్తిడి ఉంటుంది. ఒంటరిగా ఉండొద్దు. అనుకున్న పనులు సమయానికి పూర్తిచేయడం కష్టమే. జీవిత భాగస్వామి సలహాలను స్వీకరించండి.  ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా ఉంచేందుకు ప్రయత్నంచండి.

ధనుస్సు రాశి

ఈ రోజు కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. నూతన విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. 

మకర రాశి

మకర రాశివారు తప్పుడు చర్యలకు, తప్పుడు వ్యక్తులకు దూరంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు. అపరిచిత వ్యక్తులను నమ్మేయవద్దు. 

Also Read: పిల్లలకు అందుకే హనుమాన్ సూపర్ హీరో!

కుంభ రాశి

కుంభ రాశివారికి వృత్తి, ఉద్యోగానికి సంబంధించి కొన్ని ఆందోళనలు ఉంటాయి. ప్రేమ సంబంధాలు బావుంటాయి. ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవితం కొత్త మార్పులకు సిద్ధంగా ఉండండి.

మీన రాశి 

ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. మీ జీవిత భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారు. చేపట్టిన ప్రతి కార్యాన్ని సకాలంలో పూర్తిచేస్తారు. మీ మాటతీరు ఆకర్షణీయంగా ఉంటుంది. 

Also Read: ఏప్రిల్ 23 చైత్ర పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి కాదు హనుమాన్ విజయోత్సవం - ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసా!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మార్పులుంటాయి