EVMs Manufacturing: ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ (Lok Sabha Elections 2024) అత్యంత కీలకమైంది. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా,పకడ్బందీగా జరపడం ఎన్నికల సంఘం బాధ్యత. ఎక్కడా చిన్నలోపం కూడా తలెత్తకుండా చాలా పక్కాగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు పాత పద్ధతులకు స్వస్తి చెప్పి మరింత పారదర్శకత కోసం మార్పులు చేర్పులు చేస్తోంది ఈసీ. అలా అందుబాటులోకి వచ్చినవే Electronic Voting Machines. 1982లో తొలిసారి కేరళలోని పరవుర్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా వీటిని ప్రవేశపెట్టారు. అప్పుడే దేశవ్యాప్తంగా ఈ మెషీన్‌లపై (History of EVMs) చర్చ జరిగింది. ఆ తరవాత 2004 నుంచి ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి.


అంతకు ముందు ఉన్న బ్యాలెట్ పేపర్‌ పద్ధతిని పక్కన పెట్టి రిగ్గింగ్‌కి  ఏ మాత్రం అవకాశం లేకుండా EVMల ద్వారా ఓటు వేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే...ఎన్నికల ఫలితాలని డిసైడ్ చేసే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లలో ఎలాంటి లోపం లేకుండా తయారు (where are evms manufactured) చేయాలి. ఈ బాధ్యత తీసుకుంది Electronics Corporation of India Limited (ECIL). 1980లోనే తొలి ప్రోటోటైప్‌ మెషీన్‌ని తయారు చేసింది ఈ సంస్థ. ఆ తరవాత వీటిపై భిన్నవాదనలు వచ్చాయి. వీటిని ఎన్నికల్లో వినియోగించకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 


2004 నుంచి పూర్తి స్థాయిలో..


1988లో EVMలను ఎన్నికల్లో వినియోగించే విధంగా రాజ్యంగంలో సవరణలు చేసిన తరవాత లైన్ క్లియర్ అయింది. 2004 నుంచి అధికారికంగా వీటి వినియోగం మొదలైంది. అయితే...వీటిని ఎన్నికల సంఘానికి చెందిన Technical Experts Committee (TEC) తయారు చేస్తోంది. ఇందుకోసం రెండు సంస్థల సహకారం తీసుకుంటోంది. హైదరాబాద్‌లోని Electronic Corporation of India Limited సంస్థతో పాటు బెంగళూరులోని Bharat Electronics Limited సంస్థ ఈ EVMలను తయారు చేస్తోంది. కేవలం ఈవీఎమ్‌లే కాదు. వీవీప్యాట్‌లనూ (VVPAT) ఈ సంస్థలే తయారు చేస్తున్నాయి. ఈ మెషీన్‌లో రెండు యూనిట్స్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్..మరోటి బ్యాలెటింగ్ యూనిట్. కంట్రోల్ యూనిట్‌ పోలింగ్ ఆఫీసర్ అధీనంలో ఉంటుంది. బ్యాలెటింగ్ యూనిట్‌ ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేస్తారు. అక్కడే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. కంట్రోల్‌ యూనిట్‌పై బటన్ ప్రెస్ చేయడం ద్వారా బ్యాలెట్‌ పేపర్‌ని ప్రింట్ చేస్తారు. ఆ తరవాతే ఓటరు ఆ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే అవకాశముంటుంది. ఒక్కో EVM గరిష్ఠంగా 2 వేల ఓట్లను రికార్డ్ చేస్తుంది. ఈ మెషీన్‌లకు ఎలక్ట్రిసిటీ అవసరం ఉండదు. వాటిలో బ్యాటరీలుంటాయి. 


ఖర్చెంతవుతుంది..?


పూర్తిగా దేశీయంగా తయారవుతున్న ఈ మెషీన్‌లలో రెండు వేరియంట్స్ ఉంటాయి. ఒకటి M2 EVM మరోటి M3 EVM. 2006-10 మధ్య కాలంలో తయారైన వాటిని M2 EVMలుగా పిలుస్తారు. వీటిని తయారు చేసేందుకు ఒక్కోదానికి కనీసం రూ.8670 ఖర్చవుతుంది. ఇక M3 EVM లకు మాత్రం రూ.17 వేల వరకూ ఖర్చు అవుతుంది. ఈ మెషీన్‌ల కారణంగా ఖర్చులు పెరిగిపోతున్నాయన్న వాదన ఉన్నా...బ్యాలెట్‌ పేపర్‌ల ప్రింటింగ్‌, రవాణా, కౌంటింగ్ చేసే స్టాఫ్‌కి జీతాలివ్వడం, వాటిని స్టోర్ చేయడం లాంటివన్నీ కలుపుకుంటే అంతకన్నా ఎక్కువే ఖర్చవుతోంది. 


Also Read: Prisoners Voting Rights: ఖైదీలకు ఓటు వేసే హక్కు ఎందుకు లేదు? ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఏం చెబుతోంది?