Valmiki Ramayana Sundara Kanda: ఆంజనేయుడి అద్భుత విన్యాసాన్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తుంది సుందరకాండ. మొదటి ఘట్టం నుంచి చివరి ఘట్టం వరకూ ప్రతి మలుపూ ఆసక్తికరంగానే ఉంటుంది. హనుమాన్ ని చూస్తే పిల్లలు సూపర్ మెన్ ని చూసినట్టు ఎగిరిగంతులేస్తారు. పైగా ఈ మధ్యే హనుమాన్ సినిమా చూసిన ఉత్సాహంలో ఉన్నారు కాబట్టి...ఆంజనేయుడి గురించి ఏం చెప్పినా వాళ్లకు తొందరగా అర్థమవుతుంది. అందుకే రామాయాణ కాండల్లో అందమైన సుందరకాండ గురించి చిన్నారులకు కథలుగా చెప్పేందుకు ప్రయత్నించండి. రామాయణంపై ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి , కొందరికి పురాణాలు చదివే అలవాటుంది...అందుకే మీకు ప్రతి ఘట్టం తెలిసే ఉంటుంది. పిల్లలకు కథల రూపంలో చెప్పండి. ఎందకంటే సుందరకాండ చదివినా విన్నా మృత్యుభయం, అనారోగ్యం తొలగిపోతుంది...పిల్లల్లో నూతన ఉత్సాహంతో కనిపిస్తారు. 


Also Read: తమలపాకులంటే ఆంజనేయుడికి ఎందుకంత ప్రీతి!
 
సుందరకాండలో ఏం ఉంటుంది!


ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకుంటాడు...రావణుడి దగ్గర బంధీగా ఉన్న సీతాదేవిని వెతుకుతాడు... ఆ తర్వాత అలాగే వెనక్కు తిరిగి వచ్చేయకుండా లంకకు నిప్పుపెట్టి తను ఎవరి తరపున వచ్చారో, తన బలం ఏంటో పరిచయం చేస్తాడు...ఆ తర్వాత సీతమ్మ క్షేమంగానే ఉందనే సమాచారం అందించేందుకు రాముడిని చేరుకుంటాడు. నాలుగు ముక్కల్లో సుందరకాండ చెప్పేశాం అనుకోకండి...వివరంగా చదివితే ఇందులో ప్రతి శ్లోకం, ప్రతి ఘట్టం అద్భుతం. భక్తిశ్రద్ధలతో చదివినా, విన్నా, నిత్యం పారాయణం చేసినా, ప్రవచించినా మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది.


Also Read: ఏప్రిల్ 23 చైత్ర పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి కాదు హనుమాన్ విజయోత్సవం - ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసా!


సుందర కాండలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం...


సుందరే సుందరో రామః సుందరే సుందరీకథా
సుందరే సుందరీ సీతా సుందరే వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః
సుందరే సుందరం మంత్రం సుందరే కింన సుందరమ్


వాల్మీకి రామాయణంలో సుందరకాండకే ఎందుకు అంత ప్రాముఖ్యత అనే ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకం. సుందరకాండలో వర్ణించిన శ్రీరామచంద్రుడు పరమ సుందరుడు, అందులో కథ అత్యంత సుందరం, సీతాదేవి సుందరి, ఆమె ఉన్న వనం పరమ సుందరమైనది, కావ్యం మరింత సుందరమైనది, హనుమంతుడు సుందరుడు, మంత్రం కూడా సుందరమే..అసలు ఈ కాండలో సుందరం కానిది ఏముంది...అదే ఈ శ్లోకం అర్థం. 


Also Read: వ్యతిరేక దిశలో ప్రవహించే నర్మదా నది ప్రేమకథ తెలుసా!


ఇక పిల్లలకు శ్లోకాలు అర్థంకావు కాబట్టి...సుందరకాండలో ఉన్న కొన్ని ఘట్టాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాం...వాటి ఆధారంగా హనుమాన్ విన్యాసాలు వివరించేందుకు ప్రయత్నించండి. అయితే సుందరకాండలో ఏం చదివితే ఎలాంటి ఫలితం లభిస్తుందో కూడా ఇక్కడ పేర్కొన్నాం. 


@ చీటికీ మాటికీ భయపడే పిల్లలకు లంకా విజయం గురించి చెప్పండి - భూత ప్రేతాలున్నాయనే భయంతో ఉండే పిల్లల్లో ధైర్యం పెరుగుతుంది


@ బుద్ధిమాంద్యం ఉండే పిల్లలకు హనుమ నిర్వేదం చదివి వినిపిస్తే ఆ సమస్య నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది


@ లంకలో సీతాన్వేషణ ఘట్టం గురించి చెబితే...ఇతరులు వల్ల కలిగిన బాధల నుంచి విముక్తి దొరుకుతుంది


@ అశోకవనంలో సీతాదేవిని ఆంజనేయుడు చూసిన ఘట్టం చదివితే ఆర్థిక బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది...


@ త్రిజటా స్వప్న వృత్తాంతం ( ఓ కోతి వచ్చి లంకలో అల్లకల్లోలం సృష్టించినట్టు త్రిజట అనే రాక్షసికి కల వస్తుంది). ఇది చదివితే చెడు కలలు రావడం, నిద్రలో ఉలిక్కిపడి లేవడం జరగదు..


@ ఓ తెల్లవారుఝామున సీతవద్దకు వస్తాడు రావణుడు...ఆ సమయంలో ఇద్దరి మధ్యా జరిగిన వాదన చదివితే బుద్ధి పెరుగుతుంది


@ రావణుడు వెళ్లిపోయిన తర్వాత ఆమె సీత అని నిర్ధారణ చేసుకున్న హనుమంతుడు ఆమె ముందుకి దూకుతాడు.. అప్పుడు సీత-హనుమ మధ్య జరిగిన చర్చ చదివినా, విన్నా...దూరమైన వారు తిరిగి కలుస్తారు


@ తనను రాముడు పంపించాడని చెప్పేందుకు సూచనగా ఆంజనేయుడు సీతాదేవికి ఉంగరం చూపిస్తాడు..ఈ ఘట్టం చదివితే కష్టాలు తొలగిపోతాయి


Also Read: ఈ ఏడాది మే 1 నుంచి నర్మదానది పుష్కరాలు - ఘాట్ల వివరాలివే!


@ రాముడి ఉంగరం చూసిన తర్వాత అందుకు ప్రతిగా తన చూడామణి తీసి హనుమతో పంపిస్తుంది...ఈ ఘట్టం చదివితే జ్ఞానం పెరుగుతుంది


@ లంకలో రాక్షసులను హనుమ వధించిన ఘట్టాలు చదివితే శత్రువులపై విజయం సాధిస్తారు


@ పిల్లలు ఉత్సాహంగా ఆంజనేయుడితో పాటూ గెంతులేసే ఘట్టం లంకాదహనం. ఈ ఘట్టం చదివితే అభివృద్ధి చెందుతారు


@ సీతా సందేశాన్ని రాముడికి ఆంజనేయుడు నివేదించిన విధానం చదివితే తలపెట్టిన అన్ని పనులు నెరవేరుతాయి


@ పెళ్లికానివారు నిత్యం సుందరకాండ పారాయణం చేస్తే ఉత్తమ జీవిత భాగస్వామి దొరుకుతారు


@ సుందరాకండను 68 రోజుల పారాయణం చేస్తే సంతాన సమస్యలు తీరిపోతాయి


@ బ్రహ్మాస్త్ర బంధం నుంచి హనుమంతుడు విముక్తి పొందిన ఘట్టం చదివితే శనిబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది


@ నిత్యం సుందరకాండ పారాయణం చేస్తే ఎప్పుడూ రామచంద్రుడు మీతోనే ఉంటాడు...రాముడు ఉన్నచోటే హనుమంతుడు ఉంటాడు కదా...


Also Read: నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయ్ - 12 రోజుల్లో ఏ రోజు ఏ దానం చేయాలో తెలుసా!