20 ఏప్రిల్ 2024 శనివారం రాశిఫలితాలు
మేషం
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆస్తులకు సంబంధించిన నిర్ణయాలు తొందరపాటుతో తీసుకోవద్దు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు కొత్త వ్యక్తులను కలుస్తారు. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు.
వృషభం
మీ వృత్తి జీవితంలో అన్ని పనుల సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. కుటుంబంలో వివాదాలు సమసిపోతాయి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఖర్చులు తగ్గించునేందుకు ప్రయత్నించాలి.
Also Read: ఏప్రిల్ 23 చైత్ర పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి కాదు హనుమాన్ విజయోత్సవం - ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసా!
మిథునం
ఈ రాశి విద్యార్థులు పరీక్షలో మంచి మార్కులు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయాలనే కోరిక పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. మీరు ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు అవుతారు.
కర్కాటకం
ఈ రాశివారికి కుటుంబం నుంచి మద్దతు పెరుగుతుంది. జీవితంలో ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. ప్రేమ జీవితం బావుంటుంది.
సింహం
ఈ రాశి ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. భూమి లేదా వాహన కొనుగోలుకు అవకాశం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఈరోజు మంచి రోజు. నిపుణుల సలహా తీసుకున్న తర్వాత తీసుకున్న పెట్టుబడులు పెట్టండి. కొంతమంది ఉద్యోగాలు మారే ఆలోచనలో ఉండవచ్చు.
కుటుంబంతో కలసి విహారయాత్రలు ప్లాన్ చేసుకుంటారు..
Also Read: వ్యతిరేక దిశలో ప్రవహించే నర్మదా నది ప్రేమకథ తెలుసా!
కన్యా
కార్యాలయంలో పోటీ వాతావరణం ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు డబ్బుకు సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి
తులా
కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు,వ్యాపారులకు సానుకూల ఫలితాలున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది. మీ జీవితభాగస్వామితో బాధను పంచుకునేందుకు సంకోచించవద్దు.
వృశ్చికం
ఈ రాశివారు కెరీర్ , లవ్ కి సంబంధించిన పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేయరు. వృత్తి జీవితంలో ముఖ్యమైన విజయాలు సాధిస్తారు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటారు. ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
Also Read: ఈ ఏడాది మే 1 నుంచి నర్మదానది పుష్కరాలు - ఘాట్ల వివరాలివే!
ధనస్సు
ఆరోగ్యం మెరుగుపడుతుంది. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. జీవితంలో కొత్త సానుకూల మలుపులు ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా బావుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు.
మకరం
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. మీరు కుటుంబంతో కలిసి కొన్ని మతపరమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఆర్థిక విషయాల్లో శుభవార్తలు అందుతాయి. మీరు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితం బావుంటుంది
Also Read: నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయ్ - 12 రోజుల్లో ఏ రోజు ఏ దానం చేయాలో తెలుసా!
కుంభం
ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలలో హెచ్చుతగ్గులుంటాయి. కుటుంబ ఫంక్షన్ లేదా పార్టీకి హాజరు కావచ్చు. జిమ్ లేదా కొత్త వృత్తి జీవితంలో చాలా పెద్ద మార్పులు వస్తాయి. కెరీర్ పురోగతికి బంగారం లాంటి అవకాశం వస్తుంది. వైవాహిక జీవితం బావుంటుంది.
మీనం
వృత్తి, ఉద్యోగాల్లో మంచి పనితీరు కనబరుస్తారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఖర్చులను నియంత్రించడంపై దృష్టి సారించండి. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది..