Saturn Sun Conjunction Its impact on your zodiac sign: నెలకో రాశిలో సూర్య సంక్రమణం జరుగుతుంది. ప్రస్తుతం మకర రాశిలో ఉన్న సూర్యుడు ఫిబ్రవరి 12న కుంభంలోకి అడుగుపెడతాడు. నెల రోజుల పాటూ ఇదే రాశిలో సంచరిస్తాడు. 


రెండున్నరేళ్లకోసారి రాశి మారే శని దేవుడు ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 18న మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. 


అంటే ఫిబ్రవరి 12 నుంచి దాదాపు నెలరోజులు సూర్యుడు  తన తనయుడు శనితో కలసి సంచరిస్తాడు. తండ్రి కొడుకు కలసి చేసే సంచారం ఓ వ్యక్తి జీవితంలో సుఖ దుఃఖాలకు, విజయం పరాజయానికి , ఆరోగ్యం, వృత్తి ఉద్యోగం, వివాహం, ఆర్థిక సంబంధిత విషయాలపై ప్రభావితం చూపిస్తుంది. 


సూర్యుడు శని కలయిక వల్ల ఈ మూడు రాశులు అత్యంత లాభపడతాయి


Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు - మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!


మేష రాశి


సూర్యుడు - శని కలసి సంచారం వల్ల మేష రాశి వారికి ఉద్యోగ, వ్యాపార విషయాల్లో విశేష ప్రయోజనాలు లభిస్తాయి. ఆర్థిక , వృత్తి ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి.  దంపతుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. భూమికి సంబంధించిన పనుల్లో ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక విస్తరణ ఉండవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. 


సింహ రాశి


సింహ రాశి వారికి సూర్యుడు -  శని కలయిక వలన గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సంయోగం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఉద్యోగస్తులకు ఇది శుభ సమయం అవుతుంది. ఈ సమయంలో మీకు మానసిక ఒత్తిడి దూరమవుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. వివాహితులకు మంచి సమయం ఉంటుంది. ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది. భాగస్వామ్య పనులలో ప్రయోజనం ఉంటుంది.


కుంభ రాశి


కుంభ రాశికి చెందిన వారికి కూడా సూర్యుడు -  శని కలయిక కూడా అదృష్టంగా పరిగణిస్తారు. ఈ రాశి ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. విదేశాలకు ప్రయాణం చేయాలి అనుకునేవారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో అద్భుతమైన ఆర్థిక పురోగతికి అవకాశం ఉంటుంది. మీరు పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు.


Also Read: శివరాత్రులు ఎన్ని .. భోళా శంకరుడికి మహా శివరాత్రి ఎందుకు మరింత ప్రత్యేకం - శివయ్యకు ఏ అలంకారం ఇష్టం!


సూర్యుడికి నిత్యం అర్ఘ్యం అర్పించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు


కుదిరితే ప్రతిరోజూ లేదంటే ఆదివారం "ఆదిత్య హృదయ స్తోత్రం" పఠించండి


ఆదివారం రోజు గోధుమలు, బెల్లం, రాగి పాత్రలు, ఎర్రటి వస్త్రాలు, ఎర్ర చందనం దానం చేయండి


పేదలకు దానం చేయండి. 


శనిగ్రహానికి సంబంధించిన పరిహారాల కోసం రావిచెట్టు కింద దీపం వెలిగించండి. 


 “ఓం శం శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని ప్రతిరోజూ లేదా శనివారం 108 సార్లు జపించండి


ఈ పరిహారం శని యొక్క అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది. రావి చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి


Also Read: మౌని అమావాస్య, శివరాత్రికి భారీ రద్దీలో కుంభమేళాకి పరిగెత్తకండి.. ఇంట్లోనే ఇలా చేయండి చాలు!


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.