Horoscope Today 14th January  2024  - జనవరి 14 రాశిఫలాలు


మేష రాశి (Aries Horoscope Today) 


ఈ రోజు మీరు పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వాహన ఆనందం పొందుతారు. మీ మాటతీరు మెచ్చుకోలుగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 


వృషభ రాశి (Taurus  Horoscope Today)


మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది. సంగీతం, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వాహన నిర్వహణకు డబ్బు వెచ్చించాల్సి రావొచ్చు. సహనం తగ్గుతుంది. స్నేహితుల సహకారంతో పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ జీవితంలో ఆనందం  ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.


Also Read: భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేండి!


మిథున రాశి (Gemini Horoscope Today) 


రోజంతా ఆనందంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు కార్యాలయంలోని పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి   అవకాశాలు ఉంటాయి. మీరు   ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మేధోపరమైన  పనుల నుంచి ఆర్థిక లాభం ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది 


కర్కాటక రాశి (Cancer Horoscope Today)  


వ్యాపార లాభిస్తుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. కార్యక్షేత్రంలో పెనుమార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. తల్లి సహకారంతో ధనలాభం ఉంటుంది. మీరు కార్యాలయంలో పూర్తి విశ్వాసంతో కనిపిస్తారు. మానసికంగా తీసుకునే నిర్ణయాలు హాని కలిగిస్తాయి. వాహన నిర్వహణకు ధనం వెచ్చించవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.


Also Read: మకర సంక్రాంతి శుభాకాంక్షలు - మీ బంధుమిత్రులకు చెప్పేయండిలా!


సింహ రాశి (Leo Horoscope Today)


ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి. మీరు కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి, కానీ అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది.


కన్యా రాశి  (Virgo Horoscope Today) 


భావోద్వేగాలలో ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పని చేస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. మాటలో కర్కశత్వం ప్రభావం ఉంటుంది. కార్యాలయంలో కొత్త ప్రాజెక్ట్‌లో పని చేసే అవకాశం ఉండవచ్చు. మీరు అన్ని పనుల్లో ఆశించిన విజయాన్ని పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 


Also Read: కనుమ శుభాకాంక్షలు తెలియజేసేందుకు కొటేషన్స్!


తులా రాశి (Libra Horoscope Today) 


కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  ఉద్యోగంలో మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడానికి డబ్బు ఖర్చు చేయవచ్చు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి  కోపాన్ని నివారించండి. ఈరోజు స్నేహితుల సహకారంతో వ్యాపారంలో ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి  


వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 


మేధోపరమైన పనుల ద్వారా ఆర్థిక లాభాలకు కొత్త మార్గాలు సుగమం అవుతాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆరోగ్యాన్ని  అశ్రద్ధ చేయవద్దు.  కుటుంబంతో కలిసి కొన్ని మతపరమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది..ఖర్చులు కూడా అలానే ఉంటాయి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలను తెలివిగా తీసుకోండి. 


Also Read: సంక్రాంతి వేళ మీ ఇంటిముందుకొచ్చిన శివుడు, శ్రీ మహావిష్ణువుని నిర్లక్ష్యం చేయకండి!


ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 


ఓర్పుతో మెలగాలి.   మానసిక ప్రశాంతతను పొందుతారు. సంభాషణలో సమతుల్యతతో ఉండండి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈరోజు శుభవార్త అందుతుంది. కుటుంబంలో ఆర్థిక వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దానధర్మాలలో పాలుపంచుకోవచ్చు. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి.


మకర రాశి (Capricorn Horoscope Today) 


మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఇంట్లో ఆనందకర వాతావరణం ఉంటుంది.  పాత స్నేహితులను కలుస్తారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. పిల్లల వైపు నుంచి ఇబ్బందులు ఉండవచ్చు. అధిక ఖర్చుల వల్ల మనస్సు కలత చెందుతుంది.  వస్తుసౌఖ్యాలు, సంపద పెరుగుతాయి. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉంటాయి, కానీ ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.


Also Read: మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను - సంక్రాంతి సంబరాన్ని రెట్టింపు చేసే గొబ్బిళ్ల పాటలివే!


కుంభ రాశి  (Aquarius Horoscope Today) 


ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది.   ఆదాయ వనరులను పొందవచ్చు. ఆరోగ్యం బావుంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు.  వ్యాపారులు, ఉద్యోగులుకు శుభసమయం. పని పెరుగుతుంది కానీ లక్ష్యాలను సాధించడంలో సక్సెస్ అవుతారు..


మీన రాశి (Pisces Horoscope Today) 


మీనరాశి వారికి ఈ రోజు బావుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉండేవారికి అనుకూల సమయం. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు నూతన పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కష్టపడి పనిచేయడం ద్వారా మీ లక్ష్యాలను సాధిస్తారు. 


Also Read: బొమ్మల కొలువు ఎందుకు - ఏ బొమ్మలు ఏ మెట్టుపై పేర్చాలి!


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   


ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని  కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు ఏబీపీ దేశం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు