Significance Of Bommala Koluvu 2024:  సంక్రాంతి ఆనందానికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీక.
 ‘సం’ అంటే మిక్కిలి
 ‘క్రాంతి’ అంటే ప్రగతి పూర్వక మార్పు
 ‘సంక్రమణం’ అంటే ‘చక్కగా క్రమించడం’ అంటే ‘నడవడం’ 
సూర్యుడు ఒకరాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. అలా నెలకొకసారి వచ్చే దానిని ‘మాస సంక్రాంతి’గా వ్యవహరిస్తారు. సర్వసాక్షి, సమస్త ప్రాణులకు జీవప్రదాత సూర్యభగవానుడు పుష్యమాసంలో మరకరాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి. నాలుగు రోజుల సంక్రాంతి సందడిలో మొదటి రోజు భోగి. ఈ రోజు సాయంత్రం పిల్లలకు భోగిపళ్లు పోస్తారు..అదే సమయంలో చేసే మరో ఉత్సవం బొమ్మల కొలువు. 


బొమ్మల కొలువు ఎందుకు!
ప్రతి సంక్రాంతికీ కాలపురుషుడు సంక్రాంతి పురుషుడిగా   భూలోకానికి దిగివచ్చి భూలోక వాసులని పరిపాలిస్తాడు. ఆ సంక్రాంతి పురుషుడినే  సంకురమయ్య అంటారు.  ఈ చరాచర జగత్తునూ నడిపించే సంక్రాంతి పురుషుడిని స్వాగతిస్తూ...ఆయన గౌరవార్థం బొమ్మల కొలువు పెడతారు. అంటే మనమంతా కాలపురుషుడి దృష్టిలో బొమ్మలమే. ఈ బొమ్మలను రక్షించే భారం నీదే అని విన్నపం చేసేందుకే సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు. ముందుగా పసుపు వినాయకుడిని పూజించాక, పసుపుతో పెద్ద ముద్ద చేసి బొట్టు పెట్టి సంకురమయ్యగా భావించి పూజిస్తారు ఆ తర్వాత మిగిలిన బొమ్మలు పేరుస్తారు.


Also Read: ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకంటారు!


ఓ పద్ధతి..విధానం పాటించాలి
బొమ్మల కొలువు అంటే ఇంట్లో ఉన్న బొమ్మలన్నిటినీ అలంకరించేయడం కాదు..వాటిని పేర్చేందుకు ఓ పద్ధతి అనుసరించాలి. సాధారణంగా బొమ్మలను మూడు, ఐదు, తొమ్మిది వరుసలలో పేరుస్తారు. ఈ బొమ్మల కొలువు పేర్చేముందు ముఖ్యంగా ఏం తెలుసుకోవాలంటే భగవంతుడి దశావతారాల సూత్రాల ప్రకారం సృష్టి పరిణామ క్రమం, మానవుడి అభివృద్ధి క్రమం ప్రకారం బొమ్మలు అలంకరించాలి.


బొమ్మల కొలువులో తొమ్మిది మెట్లలో ఏ మెట్టుపై ఏ బొమ్మలు పెట్టాలంటే...


మొదటి మెట్టు ( దిగువ మెట్టు)
దిగువ మెట్టుమీద చిన్న చిన్న ఇళ్ల బొమ్మలు, గుడులు, గోపురాలు, పొలాలు, చెట్లు, పూలతీగలు ఇలా ప్రకృతికి సంబంధించిన బొమ్మలు పేర్చాలి


రెండో మెట్టు
రెండో మెట్టుపై జలచరాలను ఉంచాలి..అంటే... చేపలు, తాబేలు, నత్త, పీత, శంఖం లాంటివి..


Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!


మూడు, నాలుగు మెట్లు
మూడు, నాలుగు మెట్లపై క్రిమికీటకాలు, భ్రమరాలకు సంబంధించిన బొమ్మలు..


ఐదో మెట్టు
ఐదో మెట్టుపై జంతువులు, పక్షులకు సంబంధించిన ఏ బొమ్మలైనా పేర్చవచ్చు


ఆరో మెట్టు
ఆరో మెట్టుపై మానవ రూపాలకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి
 
ఏడో మెట్టు
ఏడో మెట్టుపై మహనీయుల బొమ్మలు పెట్టాలి


Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!


ఎనిమిదో మెట్టు
అష్టదిక్పాలకులు,నవగ్రహాలు, పంచభూతాలకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి


తొమ్మిదో మెట్టు (పైన మెట్టు)
అన్నిటి కన్నా ఉన్నతమైన తొమ్మిదో మెట్టుపై  త్రిమూర్తులు, లక్ష్మీ,సరస్వతి, పార్వతి బొమ్మలతో అలంకరించాలి


ఇప్పుడు మీ కొలువుని పై మొట్టునుంచి గమనిస్తే... మొదట దేవుడి బొమ్మలు అలంకరించి..ఆ తర్వాత మీ దగ్గరున్న బొమ్మలను డివైడ్ చేసుకుని ఎలా పేర్చాలో నిర్ణయించుకోండి. 


ఈ బొమ్మలు తప్పనిసరి


సౌభాగ్యం, సంతానం, పాడిపంటలు, సుఖమయ కుటుంబజీవనం కోసం సంక్రాంతిలో బొమ్మల కొలువు పెడతారు. వినాయకుడితో, కుమారస్వామితో ఉన్న శివపార్వతుల బొమ్మ తప్పకుండా పెడతారు. పిల్లవాడిని ఎత్తుకున్న తల్లి బొమ్మ పెడతారు. భోగినాడు పెట్టి కనుమ రోజు వరకూ కొనసాగిస్తారు. 


Also Read: సంక్రాంతికి అందరూ ఊరెళ్లిపోవాలి అనుకుంటారెందుకు!


నోట్: కొన్ని పుస్తకాలు, పండితులు చెప్పిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం