Daily Horoscope for 3 September 2024

మేష రాశి

ఈ రోజు ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఆర్థిక సంబంధిత విషయాల్లో గందరగోళానికి గురవుతారు. మీ ప్రణాళక ప్రకారం ముందుకుసాగండి..సందేహాలు పెట్టుకోవద్దు. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది 

వృషభ రాశి

ఈ రోజు మీ దినచర్య కాస్త అల్లకల్లోలంగా ఉంటుంది. పిల్లల పురోగతితో సంతోషిస్తారు. మీ అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దే అలవాటు మానుకోండి. ఏ పనిలోనూ అలసత్వం ప్రదర్శించవద్దు. కొన్ని పనులు వాయిదా పడవచ్చు. 

మిథున రాశి

మీ పనితీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వ్యాపార కార్యకలాపాలు వేగవంతమవుతాయి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.  పెద్దల నుంచి మంచి సలహాలు పొందుతారు.

Also Read: సెప్టెంబరు 2024 లో ఈ రాశులవారు అన్ని రంగాల్లో దూసుకెళ్తారు - ఆర్థికాభివృద్ధి ఉంటుంది !

కర్కాటక రాశి ఈ రాశివారి పనితీరు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకునేలా చేస్తుంది. ప్రతికూలత మిమ్మల్ని శాసిస్తుంది. మీరు మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని కారణాల వల్ల కుటుంబ సభ్యులు మీతో ఏకీభవించరు.  

సింహ రాశి

కొత్త వ్యక్తులను వెంటనే నమ్మవద్దు. ఓర్పు, సంయమనంతో పని చేస్తారు...ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 

కన్యా రాశి

ఈ రోజు అదృష్టం మీకు అంత అనుకూలంగా ఉండదు. ఇతరులను నమ్మి పెట్టుబులు పెడితే ఆర్థికంగా నష్టపోతారు. ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో సమస్యలు ఎదురవుతాయి. పిల్లల చదువు విషయంలో సీరియస్ గా ఉంటారు. ఆనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త. 

తులా రాశి

ఈ రాశి వ్యాపారులు పెద్ద ఒప్పందం చేసుకోవచ్చు. మీ పనితీరుతో కార్యాలయంలోని అధికారులు చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. 

Also Read: ఈ ఆలయంలో తప్పుడు ప్రమాణం చేస్తే.. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు!

వృశ్చిక రాశి 

ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. పాత స్నేహితులను కలుస్తారు..వారి నుంచి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులు జీతాల పెంపు గురించి ఉన్నతాధికారులతో చర్చిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన ఉద్యోగం చూసేవారి ప్రయత్నాలుఫలిస్తాయి. 

ధనస్సు రాశి

అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయంతో పాటు మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ సామర్థ్యాలను సమర్ధవంతంగా వినియోగిస్తారు.  కుటుంబ సభ్యుల సమ్మతితో తీర్థయాత్రను ప్లాన్ చేసుకుంటారు. మిమ్మల్ని మీరు శక్తివంతంగా  ఉంచుకోవడానికి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. గుండె రోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.   

కుంభ రాశి 

ఈ రోజు పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. రోజు ఆరంభం కన్నా గడిచే కొద్దీ మంచి ఫలితాలు పొందుతారు.  ఉద్యోగులు కార్యాలయంలోని అడ్డంకులను తొలగించడానికి కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. సామాజిక సంస్థల్లో దానధర్మాలు ,  సేవా కార్యక్రమాలు చేస్తారు 

మీన రాశి

ఈ రోజు మీరు కష్టం అనుకున్న పనులు కూడా చాలా సులభంగా పూర్తిచేస్తారు. అనుకోని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ తెలివితేటలు ప్రతిచోటా ప్రశంసలు అందుకుంటాయి. స్నేహితులతో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు

Also Read: ఈ 8 ఆలయాలను రెండు రోజుల్లో చుట్టేయవచ్చు.. వినాయకచవితికి ప్లాన్ చేసుకోండి!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.