Astrology :

  ఒక రోజులోని వివిధ సమయాలలకు వేర్వేరు ప్రాముఖ్యతలు ఉంటాయి. దీన్నీ బట్టే వ్యక్తులు వివిధ లక్షణాలతో ఉంటారు. పగటిపూట జన్మిస్తే ప్రకాశవంతంగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేలా ఉంటారట. రాత్రి జన్మించిన వ్యక్తులు ప్రతి విషయంలో చాలా గోప్యంగా వ్యవహరిస్తారట. అయితే బ్రహ్మ ముహూర్తంలో జన్మించిన వారు మాత్రం చాలా భిన్నంగా ఉంటారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రపండితులు. 


బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వారి లక్షణాలు 



  • ఎంత పెద్ద సమస్య ఎదురైనా తెలివితేటలతో సులభంగా పరిష్కరించుకుంటారు

  •  పని చేసినా తమ జ్ఞానంతో విజయం సాధిస్తారు

  • అన్ని పనుల్లో క్రమశిక్షణతో వ్యవహరిస్తారు

  • వీరికి భగవంతుడిపై విశ్వాసం ఎక్కువే కానీ దేవుడిని గుడ్డిగా నమ్మరు

  • బ్రహ్మముహూర్తంలో జన్మించిన వారు కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు

  • వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు

  • జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామితో ప్రతి విషయంలోనూ ఏకీభవిస్తారు

  • బ్రహ్మ ముహూర్తంలో జన్మించినవారు స్వచ్ఛంగా ఉంటారు, ఎవ్వరినీ మోసం చేయరు

  • వీరికి సమయపాలన ఎక్కువే, పనిలో జాప్యం జరగకుండా చూసుకుంటారు

  • తెల్లవారుజామున జన్మించిన వారికి చర్చల్లో పాల్గొనడం చాలా ఇష్టం

  • ఈ సమయలో జన్మించిన వారికి పట్టుదల చాలా ఎక్కువ ఉండడం వల్ల అన్నింటా విజయం సాధిస్తారు


Also Read: పూరీలో వంటకాలను స్వయంగా లక్ష్మీదేవి పర్యవేక్షిస్తుందట అందుకే అంత రుచి!


ఇంతకీ బ్రహ్మ మూహూర్తం సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు (When is Brahma Muhurtam)
సూర్యోదయానికి 90 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మీ అంటే సరస్వతి. మనలోని బుద్ధి ప్రభోదం చెందే కాలం కాబట్టి బ్రహ్మీముహూర్తం అని అంటారు.ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ....అందుకే  బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం బ్రహ్మముహూర్తం. హిందూ ధర్మంలో అనేక పురాణాలు, శాస్త్రాల్లో ఈ బ్రహ్మ ముహూర్తం గురించి ప్రస్తావన ఉంది.  ఈ సమయం వేకువ జామున 4 గంటల నుంచి 05.30 మధ్య ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రను త్యాగం చేస్తే సర్వోత్తమని మన ఋషులు, మహర్షులు చెప్పారు. ఈ సమయంలో నిద్రలేవడం వల్ల అందం, బలం, జ్ఞానం, తెలివితేటలతో పాటు ఆరోగ్యం ఉంటుందని తెలిపారు. 


వర్ణా కీర్తి మతిం లక్ష్మీ స్వాస్త్యమాయుశ్ఛ విదంతి|
బ్రహ్మ ముహూర్తే సంజాగ్రచ్ఛివ పంకజ యథా||


Also Read: పూరీలో విగ్రహాలను దేవశిల్పి విశ్వకర్మ సగం చెక్కి ఎందుకు వదిలేశాడు!


దీనర్థం  బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల అందం, తెలివితేటలు, ఆరోగ్యంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది సంపన్నలవుతారని అర్థం. ఈ ముహూర్తానికి ప్రకృతితో లోతైన సంబంధం ఉంది. ఈ సమయంలోనే జంతువులు, పక్షులు మేల్కొంటాయి. వాటి మధురమైన కిలకిల రావాలు ప్రారంభమవుతాయి. తామర పువ్వు కూడా ఈ సమయంలోనే వికసిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్య పరుస్తుంది. లేలేమ్మని మేల్కొలుపుతుంది.  అందుకే బ్రహ్మ ముహూర్తంలో జన్మించిన వారుకూడా ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు.


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.