తిరుమల తిరుపతి దేవస్థానం ఐటీ అడ్వయిజర్‌గా అమర్ నగారంను నియమించారు. అమర్ నగరం ప్రమఖ ఆన్ లైన్ దుస్తుల విక్రయాల కంపెనీ మింత్రాకు సీఈవోగా ఉన్నారు. అయితే ఆయన  మింత్రా సీఈవోగా రాజీనామా  చేశారు. డిసెంబర్ 31 అంటే శుక్రవారం వరకే ఆయన మింత్రా సీఈవోగా ఉంటారు. జనవరి ఒకటో తేదీ నుంచి ఆయనకు ఏ ఉద్యోగం ఉండదు. అయితే ఈ లోపే ఆయనకు టీటీడీ ఐటీ అడ్వయిజర్‌గా పదవి ఇచ్చింది.


Also Read: బ్రాహ్మణులే అర్చకత్వానికి అర్హులా..? తిరుపతిలో సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు !


మింత్రాను మరో ప్రముఖ ఆన్ లైన్ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ టేకేవర్ చేసింది. దాదాపుగా మూడేళ్లుగా అమర్ మింత్రాను లీడ్ చేశారు. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుంచి బయటకు వచ్చి సొంత  వెంచర్ ప్రారంభించాలని డిసైడయ్యారు. ఈ విషయాన్ని ఫ్లిప్ కార్ట్ సీఈవో కృష్ణమూర్తి గత అక్టోబర్‌లోనే ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా తెలిపారు. ఇటీవలే కృష్ణమూర్తి సీఎం జగన్‌తో భేటీ కావడం విశేషం. 


Also Read: స్వామీ.. కోర్టుకెళ్లి తేల్చుకుందామా ? టీటీడీపై మళ్లీ ట్వీటెత్తిన రమణదీక్షితులు !


నియామకం పత్రాలను స్వయంగా అమర్ కు  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అంద చేశారు.  ఐటీ అడ్వైజర్ గా నియమించినందుకు తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి చైర్మన్ సుబ్బారెడ్డికీ కృతజ్ఞతలు తెలిపారు.  అమర్ నగరం స్వచ్చందంగా సేవలందిస్తారా లేక ఆయనకు టీటీడీ తరపున ఏమైనా జీతభత్యాలు ఇస్తారా అన్నదాని ఇంకాఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. అమర్ నగారం ... టీటీడీకి ఐటీ సలహాదారుగా ఎలాంటి సేవలు అందిస్తారో స్పష్టత లేదు. ఏ కారణంతో ఆయనను అడ్వయిజర్‌గా నియమించారో స్పష్టత లేదు కానీ...  అమర్ నగరంను టీటీడీ ఐటి అడ్వైజర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  అయితే ఐటీ అడ్వయిజర్‌గా ఈ కామర్స్ ఇం డస్ట్రీలో ప్రముఖ వ్యక్తిని నియమించడంతో టీటీడీ భవిష్యత్‌లో  భక్తులకు ఆన్ లైన్ సేవలను మరింత విస్తరించే దిశగా కసరత్తు చేస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది.  


Also Read: ఆ అర్చకులకు సంభావన ఇవ్వడంలేదు... గర్భగుడిలో పూజలు చేయనీయడంలేదు... సీఎం జగన్ ను టాగ్ చేస్తూ రమణ దీక్షితులు ట్వీట్


Also Read: వ్రతం చెడినా ఫలితం దక్కని రమణ దీక్షితులు ! పదవి కోసం ఇంకెన్ని ట్వీట్లు..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి