కృష్ణా జిల్లా గడివాడ రణరంగం అయింది. సంక్రాంతి సందర్భంగా కేసినో ఏర్పాటు చేసి జూదం నిర్వహించిన అంశంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ నియమించింది. ఆ కమిటీ శుక్రవారం అక్కడ పర్యటించాల్సి ఉంది. అయితే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనకు ముందుగానే వైఎస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు కేసినో నిర్వహించిన... మంత్రి కొడాలి నానికి చెందిన కే- కన్వెన్షన్ సెంటర్‌లో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారు ర్యాలీగా టీడీపీ ఆఫీసు వద్దకు వెళ్లారు. అక్కడ టీడీపీ ఆఫీసుపై రాళ్ల దాడి చేశారు. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. 


Also Read: ‘మెప్పు కోసం విప్పుకొని తిరుగుతావా రాజా, ఏ1 చేతిలో తన్నులు తినకుండా చూస్కో..’ ట్విటర్‌లో వైసీపీ ఎంపీల రచ్చ


మరో వైపు నిజనిర్ధారణ కమిటీని  పోలీసులు గుడివాడలోకి కూడా రానీయలేదు.  టీడీపీ కమిటీలో నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమా, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తంగిరాల సౌమ్య ఉన్నారు. పామర్రు వద్దనే అడ్డుకున్న పోలీసులు ఒక్క కారును మాత్రమే అనుమతిస్తామన్నారు. అక్కడ టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తర్వాత వీరందర్నీ గుడివాడలోకి రాక ము వద్దనే అరెస్ట్ చేసి తరలించారు. అరెస్ట్ సమయంలో టీడీపీ నేత బొండా ఉమ కారుపై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు . దీంతో ారు ధ్వంసం అయింది.  


Also Read: Gudivada : గుడివాడలో టీడీపీ వర్సెస్ వైఎస్‌ఆర్‌సీపీ - కేసినో రాజకీయంతో ఉద్రిక్తత.. మోహరించిన పోలీసులు !


  
ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తారని తెలిసినా పోలీసులు వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల్ని నియంత్రించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల పాటు కేసినోలు నిర్వహించినా పోలీసులు ఆ వైపు చూడలేదని.. ఇప్పుడు టీడీపీ నేతలు నిజ నిర్ధారణ చేసేందుకు వస్తున్నారని తెలిసి కూడా వైఎస్ఆర్‌సీపీ నేతల్ని నియంత్రించలేదని ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు గుడివాడలోకి రాకుండాప్రధాన రహదారిపై బారికేడ్లు ..రోప్‌పార్టీ పోలీసులను ఏర్పాటు చేశారు కానీ .. దాడులకు దిగుతున్న అధికార పార్టీ నేతలను మాత్రం అడ్డుకోలేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 


Also Read: Warangal: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య


  
కేసినోను మూడు రోజులు నిర్వహించిన తర్వాత  టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన తర్వాత డీఎస్పీని విచారణ అధికారిగా ఎస్పీ నియమించారు.  డీఎస్పీ ఇంకా కేసినో వ్యవహారంపై విచారణ నివేదిక ఇవ్వలేదు. ఇప్పుడీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాజకీయ అంశమయింది. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి