ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతం వెంబడి తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ ప‌రిస్థితుల అంచనాలను ఎలా అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ‌ కేంద్రం అధికారులు ప్రకటించారు.


ఈ మేరకు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకూ రాగల 3 రోజులకు సంబంధించిన వాతావరణ అంచనాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ట్వీట్ చేశారు. ఈ మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించారు. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఉరుములు, మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


Also Read: Kurnool Onion Market: గిట్టుబాటు ధరలేక ఆగ్రహించిన ఉల్లి రైతు... పెట్రోల్ పోసి ఉల్లిబస్తాలకు నిప్పు


రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


Also Read: Revant Reddy : అమరవీరుల స్థూపం కట్టేది ఆంధ్రా కంట్రాక్టరా ? కేసీఆర్‌కు డీఎన్‌ఏ టెస్ట్ చేయాలన్న రేవంత్ రెడ్డి !


తెలంగాణలో ఇలా..
తెలంగాణలో వాతావరణ పరిస్థితుల అంచనాలను హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాగల 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం లేదని వెల్లడించింది. వాతావరణం రాష్ట్రమంతా పొడిగానే ఉంటుందని అంచనా వేసింది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని అంచనా వేసింది. 






Also Read: యువనేతలకు నామినేటెడ్ పదవులు.. క్యాడర్‌లో జోష్ నింపుతున్న కేసీఆర్ !


Also Read : ఓ వైపు పథకాల సమీక్షలు..మరో వైపు జిల్లాల పర్యటనలు .. ఇక కేసీఆర్ బిజీ బీజీ !


Also Read: YS Sharmila: వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు..  త్వరలో పాదయాత్ర చేస్తా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి