తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం ప్రారంభించారు. మూడు ముఖ్యమైన కార్పోరేషన్ ఛైర్మెన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ గా మన్నే క్రిశాంక్,  మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ గా ఎర్రోళ్ల శ్రీనివాస్, గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మెన్ గా వీడా సాయి చంద్ ను నియమించారు. వీరు ముగ్గురూ యువనేతలే. చాలా కాలంగా పార్టీలో ప్రాధాన్యత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వారికి పదవులు ఇస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.


Also Read : ఓ వైపు పథకాల సమీక్షలు..మరో వైపు జిల్లాల పర్యటనలు .. ఇక కేసీఆర్ బిజీ బీజీ !


క్రిషాంక్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆయన మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ అల్లుడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కంటోన్మెంట్ టిక్కెట్ ఆశించారు. అయితే ఆ టిక్కెట్‌ను ఆయన మామ అయిన సర్వే సత్యనారాయణకు కేటాయించారు. దీంతో అసంతృప్తికి గురైన క్రిషాంక్ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అప్పట్నుంచి ఆయన టీవీ చర్చల్లో టీఆర్ఎస్ వాణిని బలంగా వినిపిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయి పదవితో ఆయనకు టీఆర్ఎస్ గుర్తింపు ఇచ్చింది. 


Also Read : పాదయాత్ర కన్నా ముందు " ఓదార్పు యాత్ర "... ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించనున్న షర్మిల!


ఇక ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్‌లో పనిచేస్తున్నారు. ఉద్యమనేతగా పేరుంది. గతంలో అనేక సార్లు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు చేజారిపోయాయి.ఇప్పటికే ఓ సారి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పోస్టు ఇచ్చారు. ఇప్పుడు మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ గా చాన్సిచ్చారు. దీంతో ప్రాధాన్యత దక్కిందని ఆయన  కూడా సంతృప్తి పడుతున్నారు. సాయిచంద్ కళాకారుడు. ఎక్కడ టీఆర్ఎస్ సభ జరిగినా ఉద్యమ గీతాలతో హోరెత్తిస్తూంటారు. ఉద్యమకారుడు కూడా కావడంతో ఆయనకు గుర్తింపు ఇచ్చారు. 


Also Read : కేసీఆర్ జాతీయ రాజకీయాల వ్యూహం ఏమిటి ? ధర్డ్ ఫ్రంటా ? యూపీఏనా ?


ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోవడంతో ఇక పార్టీని నిర్మాణపరంగా బలోపేతం చేయడంపై టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి పెట్టింది.  టీఆర్ఎస్‌ను సంస్థాగతంగా పటిష్టం చేయడం, ప్రజల్లో విశ్వాసాన్ని మరింతగా నెలకొల్పడంపై రాష్ట్ర నాయకత్వం నజర్ వేసింది. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయినా జిల్లాల నిర్మాణం మాత్రం పెండింగ్‌లో ఉంది.  ఒకవైపు పార్టీలో బాధ్యతలు అప్పజెప్పడం, మరోవైపు నామినేటెడ్ పోస్టులతో అసంతృప్తిని పారదోలడం లాంటి చర్యలతో శ్రేణులను మళ్లీ యాక్టివ్ చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో నామినేటెడ్ పోస్టుల పంపకం ప్రారంభమయింది. 


 


Also Read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి అన్నదాతల ఖాతాల్లోకి రైతుబంధు నగదు


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి