ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి మరియు ఉత్తర దిశ నుంచి గాలులు రాష్ట్రంలో వీచే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఏపీలో అన్ని ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు జరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలి రోజురోజుకూ పెరిగిపోతోంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. నేటి నుంచి మరో మూడు రోజులపాటు ఈ ప్రాంతంలో వాతావరణం పొడిగా ఉంటుంది. సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో వాతావరణం పొడిగా మారడంతో ఉష్ణోగ్రతలలో స్వల్ప వ్యత్యాసం ఏర్పడుతుంది. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం లేదు కనుక మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
దక్షిణ కోస్తాంధ్రంలో వాతావరణం పొడిగా మారిపోయింది. బలమైన గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. ఆదివారం, సోమవారాల్లో సైతం వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు తగ్గుతాయి. రాయలసీమలో నేటి నుంచి నుంచి మూడు రోజులవరకు సీమలో వర్షాలు పడే అవకాశం లేదు. వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో చలిగాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పొగమంచు కురుస్తుందని.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు కానున్నాయి.
Also Read: TTD: శ్రీవారి ఉదయాస్తమాన టికెట్ ధర కోటి.. మెుత్తం ఎన్ని టికెట్లు ఉన్నాయంటే?
Also Read: CM KCR: త్వరలోనే దళితబంధు నిధుల విడుదల.. వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం